Breaking News

Air India: ఇంక ముందుకు వెళ్లడం మంచిది కాదు!

Published on Mon, 06/16/2025 - 12:06

సాక్షి, న్యూఢిల్లీ: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది!. మార్గం మధ్యలో ఈ విషయాన్ని పసిగట్టిన పైలట్‌.. వెంటనే అప్రమత్తం అయ్యారు. విమానాన్ని గమ్యస్థానానికి తీసుకురాకుండానే వెనక్కి తీసుకెళ్లి హాంకాంగ్‌లోనే ల్యాండ్‌ చేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. 

ఢిల్లీకి చెందిన ఎయిరిండియా విమానం ఏఐ 315 బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ ప్రయాణికులతో(ఎంత మంది అనేది తెలియాల్సి ఉంది) ఈ ఉదయం హాంకాంగ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే 90 నిమిషాల ప్రయాణం తర్వాత.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్‌ గుర్తించారు. 

ఇంకా ముందుకు వెళ్లడం కుదరదు అని చెబుతూ.. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. చివరకు అక్కడే(హాంకాంగ్‌ ఎయిర్‌పోర్టులో) ల్యాండ్‌ చేశారు. విమానంలో హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి సుమారు 6గంటల ప్రయాణం పడుతుంది. పైలట్‌ మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్‌ అవుతోంది. 

ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టెక్నికల్‌ టీం సమస్యను గుర్తించే పనిలో ఉంది. ఈ ఘటనపైగానీ, విమానాన్ని రీషెడ్యూల్‌ చేయడంపైనగానీ ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ప్రస్తుతం భారత్‌లో ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్‌ 787 విమానాలను ఉపయోగిస్తోంది. 2025 గణాంకాల ప్రకారం.. ఎయిరిండియా 33 డ్రీమ్‌లైనర్‌ విమానాల్ని ఉపయోగిస్తోంది. అయితే జూన్‌ 12న జరిగిన అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. ఆ కంపెనీ బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. అలాగే బాంబు బూచీ నేపథ్యంలోనే పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యాలతో.. అన్ని బోయింగ్‌ విమానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నిర్ణయించింది. 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)