Breaking News

వ్యక్తి ప్రాణం తీసిన.. యువతి పోస్ట్

Published on Sun, 01/18/2026 - 16:52

కేరళలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన తప్పు లేకపోయినా ఓ మహిళ తనను తీవ్రంగా అవమానించిందనే బాధతో ఓ యువకుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.  తనను దూషిస్తూ వీడియో చేసి సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేసి తన పరువు తీసిందనే  మనస్థాపంతో తనువు చాలించాడు.

గోవిందపురంకు చెందిన దీపక్ అనే యువకుడు కోజికోడ్‌లో ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన వ్యక్తిగత పనిమీద కన్నూర్‌ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులో ఉన్న ఓయువతి తనను దీపక్ అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ వీడియో చేసింది. అది కాస్త ఇన్‌స్టాలో వైరలయ్యింది.దీంతో దీపక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 

అనంతరం తీవ్ర అవమాన భారంతో ఆదివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో తన తప్పేం లేదని శనివారం తన స్నేహితులతోనూ మాట్లాడినట్లు వారు పేర్కొన్నారు.  దీపక్ చాలా మంచి వాడని  అతని స్నేహితులు తెలిపారు. ఏడు సంవత్సరాలుగా తన వద్ద పనిచేస్తున్నాడని ఇప్పటివరకూ అతని గురించి ఒక్క చెడుమాట కూడా వినలేదని అతని పనిచేస్తున్న షాపు యజమాని పేర్కొన్నారు.    

అయితే ఈ ఘటన గురించి ఆ మహిళను సంప్రదించారు. బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు తన ఉద్దేశం ఏంటని ప్రశ్నించానని ఆమె తెలిపింది. వీడియో చిత్రీకరించిన సమయంలోనే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడుతుందని తెలిపానని అయితే అతను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆమహిళ పేర్కొంది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై మరింత లోతైన విచారణ చేయనున్నట్లు తెలిపారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)