Breaking News

కన్న కొడుకులా ఆదరిస్తే ఆస్తికోసం పెద్దమ్మనే కడతేర్చాడు, చివరికి

Published on Tue, 02/24/2026 - 16:11

తోడబుట్టిన చెల్లెలే కదా అని ఆదరించింది. ఆమె కొడుకును కన్నకొడుకు కంటే మిన్నగా చూసుకుంది. కట్‌ చేస్తే ఇద్దరూ కలిసి  ఆమె ప్రాణమే తీసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఫిబ్రవరి 19న స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీస్‌లో ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జయలక్ష్మి (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత అందరూ ఆమెది సహజ మరణమే అనుకున్నారు. కానీ జయలక్ష్మి లివ్-ఇన్ భాగస్వామి శ్రీనివాస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ చిక్కనాయకనహళ్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం  తెలిసింది. 

జయలక్ష్మి  సోదరి, ఆమె కొడుకే  హత్య చేశారని  చిక్కనాయకనహళ్లి పోలీసుల  ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్‌ మార్టం నివేదిక కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో సోదరి అనసూయ, ఆమె కుమారుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 19న జయలక్ష్మి మృతి చెందగా, ఒక రోజు తర్వాత ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుండగాఅసలు విషయం తెలిసింది.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!

పోలీసులు సమాచారం ప్రకారం జయలక్ష్మి భర్త, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 19 సంవత్సరాల క్రితం మరణించాడు. భర్త చనిపోయాక ఆమె శ్రీనివాస్‌ అనే వ్యక్తితో  లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించింది. అటు జయలక్ష్మి సోదరి అనసూయ తన భర్తతో విభేదాలతో విడిగా ఉంటోంది. దీంతో జాలి తలచి అధికారికంగా చంద్రశేఖర్‌ను దత్తత తీసుకున్నట్టు రికార్డులు  లేనప్పటికీ సొంత కొడుకు కంటే మిన్నగా ఆదరించింది. చదువుకు అన్ని విధాలా సాయపడింది. అయితే ఇటీవల అనసూయ, కొడుకు జయలక్ష్మి, శ్రీనివాస్‌ ఉంటున్న ఇంటికి మకాం మార్చారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. చివరికి జయలక్ష్మ , శ్రీనివాస్ కొత్త లీజుకు తీసుకున్న నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో జయలక్ష్మి నుంచి  రావాల్సిన సాయం అందదని,  ఆమె ఆస్తులన్నింటినీ తన భాగస్వామికి బదిలీ చేస్తుందని భయపడి, తల్లీకొడుకు హత్యకు కుట్ర పన్నారు. ఆమె మరణం తర్వాత వారు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని కూడా ప్లాన్ చేశారట.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)