Breaking News

విషాదం: దొంగను పట్టుకోబోయి రైలు కింద పడ్డ మహిళ

Published on Tue, 06/01/2021 - 14:37

ముంబై: రైల్లో నుంచి జారిపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముంబైలోని కల్వా, ముంబ్రా స్టేషన్ల మధ్య నడుస్తున్న స్థానిక రైలులో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తన మొబైల్‌ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ దొంగతో పోరాడుతూ విద్యా పాటిల్(35) అనే మహిళ రైల్లో నుంచి జారిపడింది. బాధితురాలిని డోంబివ్లి నివాసిగా గుర్తించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కుర్లా స్టేషన్‌లో రైలు ఎక్కారు.

ఫైసల్ షేక్ అనే వ్యక్తి రాత్రి 7.15 గంటలకు కల్వా స్టేషన్ వద్ద కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. అతడు పాటిల్ ఫోన్‌ను లాక్కొని రైలు దిగడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో నిందితుడు ఆమెను నెట్టి వేయడంతో రైలు కింద పడిపోయింది. కాగా మహిళను రక్షించే ప్రయత్నంలో కోచ్‌లోని ప్రయాణికులు వెంటనే గొలుసును లాగారు. ఆ తర్వాత రైలు డ్రైవర్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడిని ముంబ్రాకు చెందిన ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

(చదవండి: అక్రమ మైనింగ్‌ గనిలో ఇరుక్కుపోయిన ఐదుగురు)

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)