Breaking News

తెల్లారితే పెళ్లి : నేరగాడితో పారిపోయిన కానిస్టేబుల్‌

Published on Thu, 02/12/2026 - 16:59

ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల మధ్య జరగాల్సిన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో వరుడు సహా బంధువులంతా హతాశులయ్యారు. వధువు కిడ్నాప్‌ అయ్యిందంటూ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కట్‌ చేస్తే.. కథ అడ్డం తిరిగింది.

ఇద్దరూ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. జోడీ బావుంది అని పెద్దలు వారిద్దరికి ఫిబ్రవరి 8న పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని, మీరట్‌లోని బహ్సుమా ప్రాంతంలోని అక్బర్‌పూర్ సదాత్ గ్రామంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సపరివార సమేతంగా వివాహానికి ఆహ్వానిస్తూ బంధువులందరికి వెడ్డింగ్‌ కార్డ్స్‌ పంచారు. బంధువులతో సందడిగా ఉంది. సంధ్య చేతులను కాబోయే భర్త పేరుతో మెహందీ తీర్చి దిద్దారు. ముజఫర్‌ నగర్‌లోని మీరాపూర్ నుండి వచ్చే వివాహ ఊరేగింపును స్వాగతించడానికి అంతా బిజీగా ఉన్నారు. సరిగ్గా వివాహానికి ముందు రాత్రి పెళ్లి కూతురు 25 ఏళ్ల సంధ్య భరద్వాజ్ మాయమైంది. ఆమె ప్రస్తుతం అలీఘర్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తోంది. వరుడు అతుల్ శర్మ ముజఫర్‌నగర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 

వధువు కనిపించకుండా పోవడంతో వధువు తండ్రి అంకిత్ ఠాకూర్‌ను అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించాడు. అలాగే అతను గతంలో (ఫిబ్రవరి 5న) తన కుమార్తెను వివాహం చేసుకుంటే చంపేస్తానంటూ వరుడిని ఫోన్‌లో బెదిరించాడని శర్మ తన ఫిర్యాదులో హింట్‌ ఇచ్చాడు. అంకిత్‌ తన కుమార్తెను బెదిరించి కిడ్నాప్ చేశాడని , ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని తండ్రి ఆరోపించాడు.

అసలు సంగతి ఏంటంటే..
పోలీసులు ఎనిమిది గంటల్లోనే మీరట్ జిల్లాలోని బక్సర్‌లో వధువు భరద్వాజ్‌ను గుర్తించారు. వధువు కిడ్నాప్‌కు గురికాలేదని ఇష్టపూర్వకంగా ‍ఇల్లు వదిలి ప్రేమికుడు అంకిత్ ఠాకూర్‌తో వెళ్లిపోయిందని గుర్తించారు.

పోలీసుల ప్రకారం గత కొన్నేళ్లుగా భరద్వాజ్ -అంకిత్‌ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెద్దలు కుదిర్చిన  పెళ్లి ఇష్టంలేకపోవడంతో అతని స్వస్థలం ధికోలి గ్రామంలోని ఇంటికి పారిపోయింది. తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. పోలీసు అధికారి మవానా సర్కిల్ ఆఫీసర్ పంకజ్ లావానియా చెప్పారు. ఇక చేసే దేమీ లేక వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది. భరద్వాజ్‌ను కోర్టు ముందు హాజరుపరుస్తామని సీనియర్ ఎస్‌పి(గ్రామీణ) అభిజీత్ కుమార్ తెలిపారు

ఇదీ చదవండి: ఎన్‌ఆర్‌ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా

కాగా అంకిత్‌కు నేర చరిత్ర ఉందని, దోపిడీ, హత్య అభియోగాలతో సహా కనీసం తొమ్మిది కేసులు నమోద య్యాయని పోలీసులు నిర్ధారించారు. గత సంవత్సరం ఒక మద్యం దుకాణంలో జరిగిన దోపిడీ కేసులో కూడా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.

మరోవైపు తన కూతురు ప్రేమ వ్యవహారం, పెళ్లి విఫలమవడం చూసి సంధ్య తండ్రి తట్టుకోలేకపోయాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. ఫలితంగా బాజా భజంత్రీలు, విందుభోజనాలతో కళకళ లాడాల్సిన ఇల్లు  నిశ్శబ్దంగా మారిపోయింది.

ఇదీ చదవండి: అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)