Breaking News

పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?

Published on Tue, 01/06/2026 - 18:17

సోషల్ మీడియా రోజుకో వింత వైరల్‌గా మారుతుంది. తాజాగా మరోసారి వైరల్ వింత మిస్టరీగా మార్చింది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోనే. ఇంతింత కళ్లతో ఉన్న ఒక మహిళ ఫోటోను దిష్టి  బొమ్మలా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలలో తెగ వాడేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్‌​ అవుతోంది.

మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ దీనిపై ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పంచుకోవడంతో చర్చ జోరందుకుంది. బెంగళూరు వెలుపల ఉన్న ఒక నిర్మాణ స్థలంలో ఈ ఫోటో చూశాననీ, Google Lens, ఆన్‌లైన్ శోధనలను ప్రయత్నించానని, కానీ స్పష్టమైన సమాధానాలు దొరకలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ "ఆమె ఎవరు?" కోరింది. దీంతో ఆన్‌లైన్‌లో హాస్యాస్పదమైన ఊహాగానాలతోపాటు, రకరకాల సమాధానాలు వచ్చాయి.

కర్ణాటకలో నిర్మాణ ప్రదేశాలు, దుకాణాలు, పొలాలలో కూడా పదే పదే కనిపించే ఒక మహిళ ఫోటోపై దృష్టి సారించింది. సగం నిర్మించిన ఇళ్ల నుండి వ్యవసాయ భూమి వరకు ఈ మహిళ  ఫోటోను ఎందుకు పెట్టారనే చర్చ ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపర్చింది. ఆఖరికి AI చాట్‌బాట్‌లను కూడా ఈ పిక్ గురించి అడిగేశారు. ఈ ఫోటోను'దిష్టి పరిహారం'గా వాడుతున్నారని కొందరంటే, చిక్కబల్లాపుర సమీపంలోని ఒక పొలంలో దిష్టిబొమ్మలా ఇదే ఫోటోలను చూశానని మరొకరు కమెంట్‌ చేశారు.

ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్‌

ఇంతకీ ఆమె ఎవరంటే
గణేష్ అనే వినియోగదారు వివరణాత్మక వివరణ ఇవ్వడంతో దీనిపై ష్టత వచ్చింది. అతని ప్రకారం, ఫోటోలో ఉన్న మహిళ పేరు నిహారిక రావు. ఒక యూట్యూబర్. స్థానికులు ఆమె ఫోటోను ఇళ్ళు, దుకాణాలు, పొలాలు, నిర్మాణ ప్రదేశాల వెలుపల ఉంచిన తరువాత నెగిటివిటీ పోయిందట, మంచి జరిగిందట. ఇది ఆ నోటా ఈ నోటా పాకి దీన్ని దిష్టిబొమ్మగా వాడేస్తున్నారన్నమాట.  

ఇదీ చదవండి: సీనియర్‌ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)