Breaking News

ఇన్‌స్టా క్వీన్‌.. ఉద్యోగం ఊడింది

Published on Fri, 04/04/2025 - 17:02

సోషల్‌ మీడియాలో ఇన్‌స్టా క్వీన్‌(Insta Queen)గా పేరున్న సీనియర్‌ కానిస్టేబుల్‌ అమన్‌దీప్‌ కౌర్‌ను పంజాబ్‌ పోలీస్‌ శాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాదు.. ఇంతకాలం ఆమె విలాసాలకు కారణం ఏంటన్న గుట్టు కూడా ఎట్టకేలకు వీడింది. 

పంజాబ్‌లో మాదకద్రవ్యాల కట్టడికి అక్కడి ఆప్‌ ప్రభుత్వం యుధ్‌ నాశేయన్‌ విరుధ్‌ డ్రైవ్‌ చేపట్టింది. ఈ క్రమంలో  పక్కా సమాచారంతో.. బాదల్‌ ఫ్లైఓవర్ వైపు వేగంగా వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అందులో మరో వ్యక్తితో పాటు అమన్‌దీప్‌ కౌర్‌(Amandeep Kaur) కూడా ఉండగా.. వాళ్ల వద్ద 17 గ్రాముల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రాథమిక చర్యల కింద మాన్సా పీఎస్‌ నుంచి బథిండా పోలీస్‌ లైన్స్‌కు ఎటాచ్‌ చేశారు. 

 

 

అయితే.. దర్యాప్తులో డ్రగ్స్‌ రవాణాలో ఆమె పాత్ర ఉందని తేలడంతో గురువారం డిస్మిస్‌ చేస్తూ పంజాబ్‌ పోలీస్‌ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. police_kaurdeep పేరిట ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఉంది. థార్‌ కారులో కూర్చుని.. ఖరీదైన వాచీలను ధరించి పాటలు పాడుతూ ఐఫోన్లలో రీల్స్‌ చేస్తూ వస్తోంది. ఫాలోవర్స్‌ తక్కువే అయినా ఆమె ఇచ్చే బిల్డప్‌లకు ఇన్‌స్టా క్వీన్‌గా ఆమెకు ఓ పేరు అయితే ముద్రపడింది. అయితే..

 

 

అమన్‌దీప్‌ కౌర్‌ ఇంతకు ముందు కూడా వార్తల్లోకి ఎక్కారు. గుర్మీత్‌ కౌర్‌ అనే మహిళ ఆమెపై గతంలో సంచలన ఆరోపణలు చేసింది. అమన్‌దీప్‌ దగ్గర రూ.2 కోట్ల విలువైన బంగ్లా.. లక్షలు విలువ చేసే ఖరీదైన వాచీలు, కార్లు ఉన్నాయని ఆరోపించింది. ఆంబులెన్స్‌ డ్రైవర్‌ అయిన తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ ఆంబులెన్స్‌లోనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తోందని ఫేస్‌బుక్‌లో ఆరోపిస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది.  అయితే అప్పట్లో ఆ ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరికి రవాణా చేశారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)