Breaking News

చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం

Published on Thu, 07/20/2023 - 17:23

న్యూఢిల్లీ:  కునో నేషనల్‌ పార్కులో చీతాల వరుస మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుండటంతో వాటి  పరిరక్షణకు సానుకూల చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జడ్జీలు.. బీఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్రంపై న్యాయస్తానం పలు ప్రశ్నలు సంధించింది.

కాగా ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి రెండు విడతల్లో మొత్తం 20 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఓ చీత నాలుగు పిల్లలకుజన్మనివ్వడంతో వీటి సంఖ్య 24కు చేరింది. వీటిలో  గత నాలుగు నెల్లలో మూడు కూన చీతాలు సహా 8 మరణించాయి. ప్రస్తుతం 18 చీతాలు ఉండగా వీటిలో మరో రెండిటి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. 

గత వారం రోజుల్లో రెండు చీతాలు మరణించడంపై ధర్మాసనం స్పందిస్తూ.. దీన్ని ఎందుకు ప్రతిష్టాత్మక అంశంగా మారుస్తున్నారని అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటిని ‌ ప్రశ్నించింది. అయితే చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని ఇంకా కునో నేషనల్‌ పార్క్‌లోనే ఎందుకు ఉంచారని.. వేరే చోటుకు తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. 
చదవండి: వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి

20 చీతాల్లో 8 మరణించాయి.. అంటే ఏడాదిలో 40శాతం చీతాలు మృత్యువాత పడ్డాయి. ఇది మంచి సంకేతం కాదు. ఎందుకు నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించింది. వాటిని  రాజస్థాన్‌కు తరలించే మార్గాలను పరిశీలించాలని సూచించింది. అయితే వాతావరణ పరిస్థితులు (ట్రాన్స్‌లోకేషన్‌) కారణంగా 50 శాతం మరణాలు సాధారణమేనని కేంద్రం ముందుగానే ఊహించిందని కేంద్రం తరఫున ఏసీజీ వాదనలు వినిపించారు. 

దీనిపై జస్టిస్‌ పార్దివాలా స్పందిస్తూ.. మరి సమస్య ఏంటి? ఇక్కడి వాతావరణం వాటికి  అనుకూలంగా లేదా? కిడ్నీ,శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయా అని ప్రశ్నించారు. అయితే ఇన్‌ఫెక్షన్లు చీతాల మణాలకు దారి తీస్తున్నాన్నాయని ASG ధర్మాసనానికి తెలియజేశారు. లాగే  ప్రతీ చీతా మరణంపై వివరణాత్మక విశ్లేషణ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే రాజస్థాన్‌లోని అభయారణ్యాలలో ఒకటి చిరుతపులికి ప్రసిద్ధి చెందిందని.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది.  చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను  సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 1కు వాయిదా వేసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)