Breaking News

శ్వాన్‌సింగ్‌ కోసం దిగొచ్చిన భారత ఆర్మీ.. పాక్‌ యుద్ధంలో ఏం చేశాడంటే?

Published on Fri, 08/15/2025 - 13:07

సాయం చేయాలన్న ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా కలగొచ్చు. కానీ, తమ శక్తికి మించిన సాయం చేయడమనేది మామూలు విషయం కాదు. అది అసాధ్యమనే చెప్పాలి. అయితే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. సరిగ్గా ఆ మనసు కలిగినవాడే శ్వాన్‌ సింగ్‌. ఇంతకీ శ్వాస్‌ సింగ్‌ ఏం చేశాడంటే..

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకి​స్తాన్‌ ఎదురుదాడులకు పాల్పడగా.. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పదేళ్ల శ్వాస్‌ సింగ్‌ మన సైనికులకు బాసటగా నిలిచాడు. వారికి మంచినీరు, పాలు, టీ, లస్సీ.. వంటివి అందిస్తూ తనవంతు సాయం చేశాడు. ఇప్పటికే ఆ బాలుడి సేవలను ప్రశంసించిన సైనికాధికారులు.. తాజాగా అతడి చదువుకయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ ఇతనికి ఉద్యోగం వచ్చే వరకు మొత్తం తన చదువు ఖర్చునంతా భరించబోతోంది.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో మామ్ డోట్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ శ్వాన్ సింగ్. శ్వాన్ సింగ్ ఇంటికి సరిగ్గా పాతిక కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తాన్ ఉంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్.. పంజాబ్‌లోని మామ్ డోట్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ మన దేశంపై చేస్తున్న దాడులను మన సైన్యం విజయవంతంగా ఎదుర్కొంది. ఆ నేపధ్యంలో శ్వాన్‌ సింగ్ ఇంటి ప్రాంతంలో కొంతమంది ఇండియన్ ఆర్మీ డ్యూటీ చేస్తున్నారు. చుట్టూ తుపాకులు, బాంబుల మోతతో అట్టుడికిపోతున్న ఆ ప్రాంతంలో చీమ కూడా బయటకు రాలేనంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిగ్గా అదే సమయంలో తన ఇంటి నుండి చల్లని లస్సీ తయారు చేసుకుని అలసిపోతున్న ఆర్మీ అధికారులకు అందించాడు మన శ్వాన్‌ సింగ్‌. అది కూడా ఏమాత్రం బెరుకు, భయం లేకుండా దాదాపు 10 రోజులు అలా ఇస్తూనే ఉన్నాడు. ఇండియన్ ఆర్మీ శ్వాన్‌సింగ్ చేసిన ఈ సాయానికి, తెగువకు ముచ్చటపడి తన చదువును స్పాన్సర్ చేస్తోంది.

ఇక, తాజాగా శ్వాన్‌సింగ్‌ను ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌గా పలకరించింది. సాక్షి అడిగిన పలు ప్రశ్నలకు శ్వాన్‌సింగ్‌ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. అతడు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాడు.. అతడి పేరెంట్స్‌ ఏం చేస్తారు.. పది రోజుల పాటు తాను ఇండియన్‌ ఆర్మీతో గడిపిన క్షణాలను.. యుద్ధం నాటి పరిస్థితులను వివరించాడు.. ఈ వివరాల గురించి కింది వీడియోలో..
 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు