Breaking News

అన్షులా-రోహన్‌ ఇంట్రస్టింగ్‌ లవ్‌ స్టోరీ, భర్త ఆస్తి ఎంతంటే!

Published on Wed, 07/08/2026 - 12:18

బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్, దివంగత మోనా శౌరిల కుమార్తె  అన్షులా కపూర్  తన చిరకాల ప్రియుడి రోహన్ థక్కర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.  సన్నితుల సమక్షంలో పంజాబీ, గుజరాతీ సంప్రదాయాల మేళవింపుతో వైభవంగా ఈ వీరి వివాహ వేడుకు ముగిసింది. వీరి వివాహానికి సంబంధించిన  ఫోటోలు, వీడియోలు అభిమానులను అలరించాయి. అదే సందర్భంలో అన్షులా మనసు దోచుకున్నరోహన్‌ ఎవరు? అతని ఆస్తిపాస్తులేంటి అనే వివరాలు నెట్టింట  ఆసక్తికరంగా మారాయి.

Anshula Kapoor wore her late mother's 42-year-old gold tissue and zardozi  dupatta with her Tarun Tahiliani wedding lehenga | Vogue India

అన్షులా-రోహన్‌ లవ్‌ స్టోరీ
అన్షులా-రోహన్‌ దాదాపు మూడేళ్ల క్రితం 2022లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఒక తెల్లవారుజామున 1:15 గంటలకు మొదలైన వీరి చాటింగ్, ఉదయం 6 గంటలదాకా సాగిందట. అలా మొదలైన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.  పరిచయమైన మూడేళ్లకు సరిగ్గా అదే  సమయానికి ఆమెకు అన్షులాకు ప్రపోజ్ చేశారు. 2023లో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. జూలై 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. అక్టోబర్ 2025లో గోర్ ధానా వేడుక చేసుకున్నారు. కపూర్ కుటుంబం సమక్షంలో  జూన్‌లో వీరిద్దరూ  దంపతులుగా మారాయి. మూడేళ్ల క్రితం 2022లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఒక మంగళవారం తెల్లవారుజామున 1:15 గంటలకు మొదలైన వీరి చాటింగ్, ఉదయం 6 గంటలదాకా సాగిందట. అలా మొదలైన స్నేహం క్రమంగా  ప్రేమగా మారింది.  పరిచయమైన మూడేళ్లకు సరిగ్గా అదే  సమయానికి  రోహన్‌ అన్షులాకు ప్రపోజ్ చేశారు. 2023లో తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. 2025 జూలైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్‌లో  గోర్ ధానా వేడుక చేసుకున్నారు. కపూర్ కుటుంబం సమక్షంలో  జూన్‌లో వీరిద్దరూ దంపతులుగా మారాయి.

ఎవరీ రోహన్ థక్కర్
రోహన్ బహిరంగంగా కనిపించే సెలబ్రిటీ కానప్పటికీ రోహన్  స్క్రీన్‌రైటర్‌గా పాపులయ్యారు. ఆయన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన డిజిటల్ కంటెంట్ సంస్థ 'ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్' (Dharmatic Entertainment) లో ఫ్రీలాన్స్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ముంబైలో 1993 అక్టోబర్‌ 12న పుట్టాడు.  తల్లితండ్రులలు, సోదరుడు  హృదయ్ ఠక్కర్ ఉన్నారు. కానీ రోహన్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి 'ప్లేరైటింగ్ అండ్ స్క్రీన్‌రైటింగ్'లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే యూసీఎల్‌ఏ (UCLA) లో కూడా స్క్రీన్‌రైటింగ్ కోర్సు చేశారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు ఆయన అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా రంగాలలో పనిచేశారు.  ప్రస్తుతం ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాలకు కథలు రాస్తున్నారు 'ది నవలిస్ట్' (2016), 'నెవర్ టూ లేట్' (2016), 'నింబస్' (2018) వంటి లఘు చిత్రాలకు రచయితగా , స్క్రిప్ట్ సూపర్‌వైజర్‌గా అతనికి క్రెడిట్ లభించింది. రోహన్ థక్కర్ నికర ఆస్తి విలువ సుమారు 8.5 కోట్ల రూపాయలు  పై మాటేనని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

అన్షులా కపూర్ గురించి..
బాలీవుడ్‌లో పాపులర్‌ ఫ్యామిలీ కపూర్ కుటుంబానికి చెందిన అన్షులా, సెలబ్రిటీలను అభిమానులతో కలుపుతూ సామాజిక సేవా కార్యక్రమాలు చేసే 'ఫ్యాన్‌కైండ్' (Fankind) అనే సంస్థను నడుపుతున్నారు. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్ చేసిన 'ది ట్రెయిటర్స్' (The Traitors) అనే రియాలిటీ షోలో కూడా ఆమె పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్‌

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)