Breaking News

‘ఏయ్‌ అరవకు.. ఇంకొందరిని పిలవమంటావా?’

Published on Tue, 10/14/2025 - 14:04

పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌లో మెడికల్‌ కాలేజీ స్టూడెంట్‌పై జరిగిన సామూహిక ఘటన దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అయితే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలు ఆనాడు ఏం జరిగిందో చెప్పిన విషయాలు ఓ జాతీయ మీడియా కథనం ద్వారా బయటకు వచ్చింది.

వాళ్లు తమ వాహనాల నుంచి దిగి మా వైపు నడుచుకుంటూ వచ్చారు. అది గమనించి మేం అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాం. వాళ్లలో ముగ్గురు నన్ను పట్టకుని దగ్గర్లోని అడవిలోకి లాక్కెళ్లారు. నా ఫ్రెండ్‌కు కాల్‌ చేయమని నాపై ఒత్తిడి చేశారు. అయితే అవతలి నుంచి స్పందన లేకపోవడంతో.. నన్ను అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. 

గట్టిగా అరిచేందుకు ప్రయత్నిస్తే.. అరిస్తే మరికొంత మందిని పిలిపిస్తామని బెదిరించి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అని స్టేట్‌మెంట్‌లో బాధితురాలు పేర్కొంది. మరోవైపు ఒడిశా నుంచి వచ్చిన హక్కుల కమిషన్‌ బాధితురాలిని పరామర్శించి.. ఘటనపై నివేదికను సిద్ధం చేస్తోంది.

ఒడిశా జలేశ్వర్‌కు చెందిన యువతి.. పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌లోని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో చదువుతోంది. గత శుక్రవారం డిన్నర్‌ కోసం ఫ్రెండ్‌తో ఆమె బయటకు వెళ్లింది. ఆ సమయంలో.. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో గ్యాంగ్‌రేప్‌కు గురైంది. ఈ కేసుకు సంబంధించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు వాళ్లకు 10 రోజుల రిమాండ్‌ విధించింది. 

మరోవైపు అర్దరాత్రి పూట ఆమె బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. అయితే పోలీసుల నివేదిక ప్రకారం.. అత్యాచారం రాత్రి 9గం. ప్రాంతంలోనే జరిగింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)