Breaking News

జస్ట్‌ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!

Published on Wed, 02/18/2026 - 15:24

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా ఇరుకుటుంబాలు పెళ్లి సందడిలో మునిగిపోయాయి.  బందు మిత్రుల ఆనందోత్సాహాల మధ్య పెళ్లిప్రమాణాలు పూర్తయ్యాయి.  సరిగ్గా అప్పగింతల తతంగానికి కొన్న క్షణాల ముందు వివాదం మొదలైంది. పరిస్థితి తీవ్రమై వివాహం రద్దైంది. ఇంతకీ ఏమైంది?  కట్న కానుకల గొడవా? మర్యాదల తక్కువయ్యాయని అలిగారా? ఏమైంది పదండి  తెలుసుకుందాం.

యూపీలోని కోఠి థానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో  ఈ ఘటన చోటు చేసుకుంది.  ఆరు నెలల క్రితం స్థానిక అమ్మాయి,  పురే గనై గ్రామంలో నివసించే 22 ఏళ్ల అబ్బాయికి పెళ్లి నిశ్చయించారు పెద్దలు. ఫిబ్రవరి 13న జరిగే పెళ్లికి  బారాత్‌, వివాహం ఆచారాలు,సాంప్రదాయ వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. పెళ్లి తంతు అంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది.  అతిథులు ఆతిథ్యాన్ని స్వీకరించి వధూవరులను  ఆశీర్వదించాడు. అయితే, శనివారం తెల్లవారుజామున ‘బిదాయి' వేడుకకు ముందు ట్రాన్స్‌జెండర్‌ (కిన్నార్) బృందం ఆశీర్వాదం ఆచార 'నెగ్' (బహుమతి) తీసుకోవడానికి వేదికకు చేరుకుంది. వారు కొత్తపెళ్లికొడుకుని గుర్తించడంతో అనుమానం మొదలైంది.  వధువు కుటుంబం వాగ్వాదానికి దిగింది.  అసలు వరుడు మాగాడా కాదా అని స్పష్టం చేయాలని,  వెరిఫికేషన్ కావాలని వధువు బంధువులు  పట్టుబట్టారు. దీనికి వరుడు తిరస్కరించి గొడవకు దిగాడు. ఇంతలో వరుడిని తమ సంఘం సభ్యుడే ధృవీకరించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో వధువు కుటుంబం వివాహాన్ని రద్దు చేసింది. 

ఇదీ  చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

అయితే తమ పరువు పోయిందని,  రూ. 23 వేలు తీసుకుని మౌనంగా ఉండాలని వరుడి కుటుంబం విజ్ఞప్తి చేసింది. అలా  నవ వధువుతోపాటు, అప్పటిదాకా బాజా భజంత్రీలతో కళకళల్లాడిన పెళ్లి  పందిర మూగబోయింది. ఈ విషయం స్థానిక పోలీసుల దృష్టికి రావడంతో వారు  సంఘటనా స్థలానికి చేరుకుని రెండు కుటుంబాలను శాంతింపజేశారు. విషయం సున్నితమైంది గనుక, పైగా ఇరువైపుల నుంచి  ఎలాంటి ఫిర్యాదు రాలేదు కనుక  ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!

 

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)