Breaking News

ఆర్మీలో చేరతా.. ఉగ్రవాదులను  మట్టుబెడతా.. 

Published on Fri, 05/09/2025 - 04:24

బాలాసోర్‌: ‘భారత సైన్యంలో చేరి పాక్‌ ఉగ్రవాదులను అంతమొందించాలనుకుంటున్నా’పహల్గాం దాడిలో తండ్రిని కోల్పోయిన ఓ బాలుని కోరిక ఇది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నానని తొమ్మిదేళ్ల తనూజ్‌ కుమార్‌ సత్పతి గురువారం వెల్లడించాడు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం వస్తే.. తనలా ఏ బిడ్డా తండ్రిని కోల్పోకుండా చూడాలని చెబుతానన్నాడు. 

తనూజ్‌ తండ్రి ప్రశాంత్‌ సత్పతి పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం వారి కుటుంబాన్ని మీడియా కలవగా.. తనూజ్‌ మాట్లాడాడు. ‘‘నేనూ, అమ్మ బుధవారం ఉదయం నుంచి వార్తలు చూస్తూనే ఉన్నాం. పాక్‌ ఉగ్ర స్థావరాలపై దాడి మాకు చయాలా సంతృప్తినిచ్చింది. మన సైన్యాన్ని చూసి గరి్వస్తున్నా’’అని తెలిపాడు. అంతేకాదు.. సైన్యం మొదటి నుంచి తనకు, తన తల్లికి అండగా ఉందని తనూజ్‌ చెప్పారు. 

‘‘కొండపై నుంచి కిందకు వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెప్పాడు. ‘‘నాన్న వెంటనే పడిపోయాడు. నేను, అమ్మ అతని దగ్గరికి పరిగెత్తాం. తల నుంచి రక్తస్రావం అవుతోంది. నీళ్లు కావాలా అని అమ్మ అడగ్గానే.. అవునన్నాడు. నీళ్లు ఇచ్చాను’’అని పహల్గాంలో జరిగిన భయానక పరిస్థితులను తనూజ్‌ గుర్తు చేసుకున్నాడు. తనూజ్‌ పెద్దరికంగా మాట్లాడుతుండటంపై అతని తల్లి ప్రియా దర్శిని ఆందోళన వ్యక్తం చేసింది.‘‘అతను అకస్మాత్తుగా తన బాల్యాన్ని కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. పిల్లలు క్రమంగా పరిణితి చెందాలి. భగవంతుడు నా కొడుకును ఆశీర్వదించాలి’’అని ఆమె కోరుకున్నారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)