భారత్‌–రష్యా బంధానికి కొత్త శక్తి!

Published on Sat, 11/29/2025 - 04:37

న్యూఢిల్లీ: రష్యా అధినేత పుతిన్‌ వచ్చేనెల 4, 5వ తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. 23వ ఇండియా–రష్యా వార్షిక సదస్సుకు ఆయన హాజరవుతారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. మోదీ ఆహ్వానం మేరకు పుతిన్‌ రాబోతున్నారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. 

పుతిన్‌ అధికారిక పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల మరింత బలపడడానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ తదితర రంగాల్లో కీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పుతిన్‌–మోదీ భేటీ తర్వాత ఉమ్మడి ప్రకటన విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పుతిన్‌ రాకతో భారత్‌–రష్యా బంధానికి నూతన శక్తి లభించడం తథ్యమని అంటున్నారు. 

ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లు? 
స్థానిక కరెన్సీల్లో వాణిజ్య లావాదేవీలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ఇంధన రంగంలో సహకారం, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలపై పుతిన్, మోదీ చర్చించబోతున్నారు. పౌర అణు ఇంధన రంగంలో సహకారంపైనా సంప్రదింపులు జరుగనున్నాయి. అంతేకాకుండా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల్లో పురోగతిని వారు సమీక్షిస్తారు. 

ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకుంటారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రష్యా అధ్యక్షుడి గౌరవార్థం ప్రత్యేక విందు ఇవ్వబోతున్నారు. మరోవైపు రష్యా నుంచి అత్యాధునిక ఆయుధాల కొనుగోలుపై భారత్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే ఎస్‌–400 మిస్సైల్‌ వ్యవస్థలను అదనంగా కొనుగోలు చేయడంపై పుతిన్‌పై చర్చించనున్నట్లు సమాచారం. 

భారత్‌కు పుతిన్‌ శుభవార్త చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లను ఆయన ప్రకటించే వీలుందని అంచనా వేస్తున్నారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇటీవలి కాలంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. 

చమురు ఎగుమతులను భారీగా పెంచాలని పుతిన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. పుతిన్‌ చివరిసారిగా 2021లో ఇండియాలో పర్యటించారు. గత ఏడాది జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించి, పుతిన్‌తో భేటీ అయ్యారు. భారత్‌–అమెరికా సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో ఏనాడూ లేనంతగా బలహీనపడిన సమయంలో పుతిన్‌ భారత్‌ పర్యటనకు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)