Breaking News

ఆపరేషన్‌ సిందూర్‌ యోధులకు వీర్‌చక్ర పురస్కారాలు

Published on Fri, 08/15/2025 - 06:15

న్యూఢిల్లీ: ముష్కరమూకల స్థావరాలను నేలమట్టంచేసి భారత సైనిక సత్తాను చాటిన ఆపరేషన్‌ సిందూర్‌ను విజయవంతంగా అమలుచేసిన తొమ్మిది మంది వాయుసేన పైలెట్లకు భారత ప్రభుత్వం వీర్‌చక్ర పురస్కారం ప్రకటించింది. సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలువురికి గ్యాలంట్రీ అవార్డ్‌లను ప్రకటించారు. యుద్ధకాలంలో ఇచ్చే మూడో అత్యున్నత గ్యాలంట్రీ అవార్డ్‌ అయిన వీర్‌చక్రను వాయుసేనకు చెందిన తొమ్మిది మంది పైలెట్లకు ప్రకటించారు. 

గ్రూప్‌ కెప్టెన్లు రంజిత్‌ సింగ్‌ సిధూ, మనీశ్‌ అరోరా, అనిమేశ్‌ పట్నీ, కునాల్‌ కల్రాలకు వీర్‌చక్ర ప్రకటించారు. వింగ్‌ కమాండర్‌ జోయ్‌ చంద్ర, స్వాడ్రాన్‌ లీడర్లు సర్థాక్‌ కుమార్, సిద్ధాంత్‌ సింగ్, రిజ్వాన్‌ మాలిక్, ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ ఏఎస్‌ ఠాకూర్‌లకూ వీర్‌చక్ర ప్రకటించారు. ఆర్మీ తరఫున కల్నల్‌ కోశాంగ్‌ లాంబా, లెఫ్టినెంట్‌ కల్నల్‌ సుశీల్‌ బిష్ట్, నాయిబ్‌ సుబేదార్‌ సతీశ్‌ కుమార్, రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌లకూ వీర్‌చక్ర దక్కింది. యుద్ధకాల గ్యాలంట్రీ అవార్డుల్లో పరమ్‌ వీర్‌చక్ర, మహావీర్‌ చక్ర తర్వాత వీర్‌చక్రను మూడో అత్యున్నత అవార్డ్‌గా పరిగణిస్తారు.

 గ్యాలంట్రీ అవార్డ్‌ల జాబితాను గురువారం మోదీ ప్రభుత్వం విడుదలచేసింది. మేలో పాక్‌నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను ఎస్‌–400 గగనతల రక్షణవ్యవస్థ సాయంతో నేలకూల్చిన భారతవాయుసేన సిబ్బందికి సైతం గ్యాలంట్రీ అవార్డ్‌లు దక్కాయి. మరికొందరికి సర్వోత్తమ్‌ యుద్ధ సేవా మెడళ్లను ప్రకటించారు. పాక్‌లోని లష్కరే తోయిబా ఉగ్రస్థావరాలను నేలమట్టంచేసిన సౌత్‌ వెస్టర్న్‌ ఎయిర్‌ కమాండ్, 

వెస్టర్న్‌ ఎయిర్‌ కమాండ్‌లకు సారథ్యం వహించిన ఎయిర్‌ మార్షల్‌ నగేశ్‌ కపూర్, ఎయిర్‌ మార్షల్‌ జీతేంద్ర మిశ్రాలకూ సర్వోత్తమ్‌ యుద్ధసేవా మెడల్‌ను ప్రకటించారు. కేవలం వింగ్‌ కమాండర్‌ అభిమన్యు సింగ్‌కు మాత్రమే శౌర్య చక్ర ఇచ్చారు. మొత్తంగా భారతవాయుసేన నుంచి నలుగురికి సర్వోత్తమ్‌ యుద్ధ సేవా మెడల్, నలుగురికి ఉత్తమ్‌ యుద్ధసేవా మెడల్, తొమ్మిది మందికి వీర్‌ చక్ర, ఒకరికి శౌర్య చక్ర, 13 మందికి యుద్ద సేవా మెడళ్లు, 26 మందికి యువసేవా మెడళ్లు, 162 మందికి ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్నందుకు ‘మెన్సన్‌–ఇన్‌–డెస్పాచెస్‌’ దక్కాయి. రాష్ట్రపతి ముర్ము మొత్తంగా 127 గ్యాలంట్రీ అవార్డ్‌లు ప్రకటించారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)