త్రిష పేరుతో సీఎం విజయ్‌పై కామెంట్స్

Published on Tue, 08/04/2026 - 07:06

చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న (సోమవారం) కావేరీ అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో సీఎం విజయ్‌పై విమర్శలు గుప్పిస్తున్న సమయంలో సభలోని  ప్రజలనుంచి నుంచి "త్రిష-త్రిష" అంటూ నినాదాలు వ్యక్తమయ్యాయి. దీనికి ఉదయనిధి  నవ్వుతూ ఇన్యుయేండో (అర్థవంతమైన వ్యాఖ్య) అని అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 

కాగా ఈ వాఖ్యలను టీవీకేతో పాటు బీజేపీ ఖండించింది

టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ మాట్లాడుతూ " ఇలాంటి వ్యాఖ్యలు అసహ్యకరం. ఎవరిపైనైనా ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలు చేయడం పూర్తిగా సిగ్గుచేటు. ఇది ఆ కుటుంబం యొక్క ఆలోచనా విధానాన్ని, రాజకీయ సంస్కృతిని పడిపోతున్న ప్రమాణాలను బట్టబయలు చేస్తోంది" అని ఆయన మండిపడ్డారు. రాజకీయ నాయకుడిగా ఉదయనిధి స్థాయి మరింతగా దిగజారిందని విమర్శించారు.

తమిళనాడు బీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ నారాయణ తిరుపతి మాట్లాడుతుూ..తంజావూరులో  ముఖ్యమంత్రి విజయ్ ,త్రిషపై ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ ప్రసంగం అసహ్యకరమైనది, అభ్యంతరకరమైనది  సిగ్గుచేటని అన్నారు. "తల్లి, భార్య, కూతురు ఉన్న ఏ దొంగ లేదా రౌడీ కూడా అంత నీచంగా మాట్లాడలేడు. 'ద్రవిడ మోడల్' అని చెప్పుకునే ఈ వ్యక్తులు బహిరంగంగా ఇలా మాట్లాడుతుంటే, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చూస్తూ ఊరుకోవడం సిగ్గుచేటు" అని ఆయన దుయ్యబట్టారు. ఉదయనిధిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు.

బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం: "తాను ఆ కళాకారుడి మనవడిని అని చెప్పుకునే ఆయన ఇలా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. ప్రతిపక్ష నేత స్వయంగా మాజీ నటుడే. అయినప్పటికీ తోటి కళాకారుల పట్ల ఇంత చిన్నచూపుతో, అసహ్యంగా మాట్లాడడం దిగ్భ్రాంతికరం ".  అన్నారు.

గత వివాదాలు
మూడేళ్ల క్రితం సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో పోల్చి ఉదయనిధి స్టాలిన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దానిని నిర్మూలించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో, ఉదయనిధి చేసిన ఈ తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేపాయి.

ఏం జరిగింది.

తమిళనాడులో కావేరి నీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం (టీవీకే) వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తంజావూరులో ఒక భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఆ సమయంలో సభికుల్లో నుంచి కొందరు అకస్మాత్తుగా "త్రిష... త్రిష" అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడం ప్రారంభించారు. ప్రజల నుంచి ఆ నినాదాలను చూసి ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం మధ్యలో ఆగిపోయి, నవ్వుతూ ఒక డబుల్ మీనింగ్ (అర్థవంతమైన ఇన్యుయేండో) వ్యాఖ్య చేశారు. దీనిపై ఇప్పడు దుమారం చెలరేగింది

 

 

 

 

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)