Breaking News

Video: హిమాచల్‌లో వర్ష బీభత్సం.. చూస్తుండగానే ఇళ్లు నేలమట్టం

Published on Thu, 08/24/2023 - 11:42

హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం కొనసాగుతోంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కులు జిల్లాలోని అన్నీ అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. చూస్తూండగానే పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బస్టాండ్‌ సమీపంలోని ఏడు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో..బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల కుప్పకూలడం, భారీగా దుమ్ము లేవడం కనిపిస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే దృశ్యాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక కులు జిల్లాలోని అన్నీ టౌన్‌లో ఉన్న భారీ బిల్డింగ్‌లు కూలిపోయాయి. అయితే భవనాలకు పగుళ్లు ఏర్పడటంతో మూడు రోజుల క్రిత‌మే ఆ బిల్డింగ్‌ల‌ నుంచి జ‌నాన్ని త‌ర‌లించారు.  కులు-మండి హైవేపై భారీ వ‌ర్షం వ‌ల్ల వాహ‌నాలు నిలిచిపోయాయి.

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎస్‌ వంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ర‌క్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌కు భారత వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. నేటి నుంచి మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

ఇళ్లు కూలిన ఘటనపై  హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు స్పందించారు. కులులో కొండచరియలు విరిగిపడటంతో భారీ  భవనాలు కూలిపోతున్న దృశ్యాలు కలవరపరిచాయని తెలిపారు. అయితే రెండు రోజుల ముందే  ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు.ఆ బిల్డింగ్‌ల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)