Breaking News

ఢిల్లీలో దారుణం: కారుతో ఢీకొట్టి.. బానెట్‌పై అర కిలోమీటర్‌ లాక్కెళ్లి

Published on Sat, 01/14/2023 - 18:46

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గత కొంతకాలంగా హస్తీనాలో నేర సంఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. యాధృచికంగా, ఉద్ధేశపూర్వంగా జరిగినా యాక్సిడెంట్లు, హత్యలు వంటి కేసులతో దేశ రాజధాని నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల దేశం మొత్తం ఉల్కికి పడేలా చేసిన కంఝూవాలా కారు ప్రమాదం(కారుతో ఢీకొట్టి అంజలి అనే యువతిని ఈడ్చుకెళ్లిన ఘటన) తరువాత అలాంటి కోవకే చెందిన దారుణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 

తాజాగా ఢిల్లీలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్‌ ప్రాంతంలోని రోడ్డుపై ఇద్దరి వ్యక్తుల మధ్య హారన్‌ విషయంలో గొడవ తలెత్తింది. వాగ్వాదం పెరిగి పెద్దదవడంతో.. ఓ వ్యక్తి కోపంతో తన కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కారు బానెట్‌పై పడటంతో అలాగే 500 మీటర్లు(అర కిలోమీటరు) లాక్కెళ్లాడు. ఈ భయంకర దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై ఏపీసీ సెక్షన్లు 279, 323, 341, 308 కేసు నమోదు చేశారు.  సీసీటీవీ ఫుటేజీ కారు నెంబర్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏ విషయంలో గొడవ జరిగింది, అసలు ఏం జరిగిందనే దానిపై బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)