Breaking News

స్నేహితుల కళ్లదుటే ఘోరం.. 6వ అంతస్తు నుంచి పడి యువకుడి మృతి

Published on Sat, 02/04/2023 - 15:51

మరణం ఊహించనిది. చావు ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. కళ్ల ముందే సంతోషంగా కనిపించిన వారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్‌ మృత్యు ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రెండు క్షణాల ముందు వరకు స్నేహితులతో ఆనందంగా ముచ్చటించిన ఓ యువకుడు ప్రాణాలు అంతలోనే గాల్లో కలిసిపోయాయి. హాస్టల్‌ బిల్డింగ్‌లోని ఆరో అంతస్తు నుంచి కింద పడి అనూహ్యంగా మరణించాడు.

వివరాలు.. జల్‌పైగురి జిల్లాలోని ధుప్‌గురికి చెందిన ఇషాంషు బట్టాచార్య అనే 20 ఏళ్ల యువకుడు నీట్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగష్టులో కోటాలోని జవహార్‌ నగర్‌లో కోచింగ్‌ తీసుకుంటూ ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఓ రోజు  స్నేహితులతో బయటకు వెళ్లి అర్థరాత్రి తన హాస్టల్‌ తిరుగొచ్చాడు. రూమ్‌ ముందు ఉన్న బాల్కనీలో స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటున్నారు. గదిలోకి వెళ్లే ముందు బాల్కనీలో చెప్పులు పక్కకు పెడుతుండగా బ్యాలెన్స్‌ కోల్పోవడంతో రెయిలింగ్‌పై పడ్డాడు

ఇషాంషు బరువు తట్టుకోలేక అల్యూమినియం రెయిలింగ్‌ విగిరిపోవడంతో అక్కడి నుంచి కింద అమాంతం పడిపోయాడు. బిల్డింగ్‌ ఆరో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మరణించినట్లు కోటా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఎంబీఎస్‌ ఆసుపత్రికి తరలించామని.. పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించనున్నట్లు వెల్లడించారు. కాగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.  కన్నీరు పెట్టించే ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
చదవండి: Wildfires: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి..

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు