Breaking News

అంబులెన్స్‌కు దారివ్వని కారు.. షాకిచ్చిన పోలీసులు!

Published on Mon, 11/18/2024 - 14:47

రోడ్డు మీద వెళ్లేటపుడు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. అయితే అంబులెన్స్‌ సౌండ్ వినిపించగానే ఎంతటివారైనా  వెంటనే తమ వాహనాలను సైడ్‌కు తీసుకుంటారు. సినీ సెలబ్రిటీలైనా, రాజకీయ నేతలైనా.. చివరికి ప్రధాని, రాష్ట్రపతి అయినా సరే అంబులెన్స్‌ వెళ్లేందుకు దారి ఇస్తారు. కానీ ఓ ప్రబుద్దుడు అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు.

దీంతో ఆ వ్యక్తికి  పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో  నవంబర్‌ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కేరళలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. చలకుడిలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. రోడ్డుపైకి వచ్చాక అన్ని వాహనాలు పక్కకి తొలగి అంబులెన్స్‌కు దారిచ్చాయి. కానీ ఓ కారు మాత్రం అంబులెన్స్ కు దారివ్వకుండా ఏకంగా రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది. 

అంబులెన్స్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నా, ఆ కారు ఓనర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ వ్యవహారాన్నంతా అంబులెన్స్ లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ఆ కారు యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదో గుర్తించిన పోలీసులు. నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. దాదాపు రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతడి లైసెన్స్‌ కూడా రద్దు చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)