Breaking News

ఢిల్లీ ఘటన: ‘అమెరికా’ హెచ్చరిక

Published on Tue, 11/11/2025 - 07:48

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు అనంతరం అమెరికా రాయబార కార్యాలయం జనసమూహం ఉన్న ప్రాంతాలకు వెళ్లద్దంటూ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పలు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.

‘2025, నవంబర్ 10న మధ్య ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఒక కారు పేలిపోయిందని స్థానిక మీడియా నివేదించింది. పేలుడుకు కారణం తెలియనప్పటికీ, భారత ప్రభుత్వం  దేశంలోని పలు రాష్ట్రాలను హై అలర్ట్‌లో ఉంచింది’ అని తెలియజేస్తూ అమెరికా రాయబార కార్యాలయం పలు భద్రతా సూచనలు జారీచేసింది. అవి..

ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరగకండి.

గుంపులు గుంపులుగా ఏర్పడకండి.

అప్‌డేట్‌ల కోసం మీడియాను చూస్తుండండి.

మీ పరిసరాలను జాగ్రత్తగా గమనించండి.

పర్యాటకులు వచ్చే ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండండి.

సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న కారును శక్తివంతమైన పేలుడు తునాతునకలు చేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలలో చాలా వాహనాలు మంటల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఒక సీనియర్‌ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ‘ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది.  అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు. ఈ ప్రమాదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షించారు.

ఇది కూడా చదవండి: తలొగ్గిన ట్రంప్‌.. ‘భారత్‌తో న్యాయమైన ఒప్పందం’
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)