భారత్‌పై ప్రశంస.. అమెరికా అధ్యక్షుడికి కౌంటర్‌ పడ్డట్లే!

Published on Thu, 10/09/2025 - 14:06

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు గుప్పించారు. 2028 నాటికి భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆయన కౌంటర్‌ ఇచ్చారా? అనే చర్చ మొదలైంది. 

యూకే ప్రధాని హోదాలో కీర్‌ స్టార్మర్‌ తొలిసారిగా భారత్‌ పర్యటనకు వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు.

Namaskar doston నమస్కారం మిత్రులారా.. అంటూ హిందీలో యూకే ప్రధాని స్టార్మర్‌ తన ప్రసంగం ప్రారంభించారు. 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఇందుకుగానూ ప్రధాని నాయకత్వాన్ని అభినందిస్తున్నానని అన్నారాయన. అలాగే.. 2047 వికసిత్ భారత్ అనేది అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చడమేనని అన్నారాయన. ఇక్కడ నేను చూసిన ప్రతిదీ మీరు(మోదీని ఉద్దేశించి..) ఆ లక్ష్యాన్ని సాధించగలరన్న నమ్మకాన్ని నాకు కలిగించింది. ఆ ప్రయాణంలో మేము భాగస్వాములుగా ఉండాలనుకుంటున్నాం అని స్టార్మర్ (UK PM) ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే.. రష్యా ఆయిల్‌ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత ఎకానమీని డెడ్‌ అంటూ ట్రంప్‌ అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇప్పుడు బ్రిటన్‌ ప్రధాని వ్యాఖ్యలు అందుకు కౌంటర్‌గా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో యూకే-భారత్‌ మధ్య ఆర్థిక సహకారం, టెక్నాలజీ, వాణిజ్యం, విద్య రంగాల్లో సహకారం ప్రధానంగా UK–India Free Trade Agreement (FTA)పై చర్చ జరిగింది. 

ఇదీ చదవండి: భారత్‌తో యుద్ధం తప్పదు!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)