Breaking News

రాజకీయాల్లో ట్విట్టర్‌ తలదూరుస్తోంది

Published on Sat, 08/14/2021 - 03:57

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, ఆ సంస్థ దేశ రాజకీయాల్లో తలదూరుస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌ను ఆ సంస్థ తాత్కాలికంగా బ్లాక్‌ చేసిన కొద్ది రోజుల తర్వాత ఆయన తీవ్రంగా స్పందించారు.  కేంద్ర ప్రభుత్వ రాజకీయాలకు అనుగుణంగా నడిచే కంపెనీలకే మన దేశంలోకి అనుమతినిస్తారా అని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ శుక్రవారం యూ ట్యూబ్‌లో ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నా అకౌంట్‌ను బ్లాక్‌ చేయడమంటే మన దేశ రాజకీయాల్లో ఆ సంస్థ తలదూర్చడమే. మన రాజకీయాలతో ఆ సంస్థ వ్యాపారం చేసుకుంటోంది.

ఒక రాజకీయ నాయకుడిగా నాకీ విషయం మింగుడు పడడం లేదు’’ అని రాహుల్‌ అన్నారు. తనకు ట్విట్టర్‌లో 2 కోట్ల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారని తన అకౌంట్‌ బ్లాక్‌ చేయడం ద్వారా వారి అభిప్రాయాల్ని వెల్లడించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య నిర్మాణంపైనే దాడి అని రాహుల్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు. ట్విట్టర్‌ తటస్థ  వేదిక కాదని  రాహుల్‌ ఆరోపించారు. ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు ఫొటోలను రాహుల్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేయడంతో, అది నిబంధనలకు విరుద్ధమంటూ ఆయన ఖాతాని నిలిపివేసిన సంగతి తెలిసిందే.  

ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాపైనా చర్యలు తీసుకోండి :ఎన్‌సీపీసీఆర్‌
మరోవైపు రాహుల్‌ గాంధీ బాధిత కుటుంబం ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్‌ చేయడంపై పిల్లల హక్కుల పరిరక్షణ అత్యున్నత సంస్థ (ఎన్‌íసీపీసీఆర్‌) మండిపడింది. ఆ ఖాతాపైన కూడా చర్యలు తీసుకోవాలని ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేసింది.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)