Breaking News

సీఎం విజయ్‌ త్యాగం.. కాంగ్రెస్‌కు గుడ్‌న్యూస్‌

Published on Thu, 06/04/2026 - 09:07

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీవీకే పార్టీ ఆ సీటును కాంగ్రెస్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతోపాటు కూటమిలోని పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక, ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది.

ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగిన సీవీ షణ్ముగం.. తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో షణ్ముగం తన రాజ్యాసభ పదవికి మే 7న రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉండనుంది. అధికార టీవీకే కూటమి మద్దతు ఉండటంతో కాంగ్రెస్‌కు విజయావకాశాలున్నాయి.

కాగా, తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 8 వరకు, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ 18న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి కొనసాగనున్నారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)