Breaking News

పండగవేళ పతంజలికి భారీ షాక్‌ : తుకారం ముండే దెబ్బ

Published on Thu, 11/05/2026 - 16:19

దీపావళి పండగ సమీపిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో పతంజలి సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించిన 19 ఆహార వ్యాపార సంస్థల లైసెన్సులను ఎఫ్‌డీఏ రద్దు  చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 114 సంస్థల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు. సుమారు  రూ.9 కోట్లకు పైగా విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న వాటిలో ప్రముఖ 'పతంజలి ఆయుర్వేద్' సూపర్ డిస్ట్రిబ్యూటర్ వద్ద లభించిన  వేల లీటర్ల నెయ్యి కూడా   ఉండటం గమనార్హం.  

సోమవారం ఎఫ్‌డీఏ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం... మహారాష్ట్రలోని ఏడు విభాగాల పరిధిలో ఉన్న 114 ఆహార సంస్థలపై దాడులు నిర్వహించి, దాదాపు 3.53 లక్షల కిలోల ఆహార పదార్థాలను (రూ. 9.01 కోట్ల విలువైనవి) జప్తు చేశారు.

పతంజలి ఆవు నెయ్యి జప్తు 
యోగా గురు రాందేవ్‌  నేతృత్తంలోని పతంజల సంస్థకు  ఆవు నెయ్యిపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)  కొరడా ఝళిపించింది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని పతంజలి ఆయుర్వేద్ సూపర్ డిస్ట్రిబ్యూటర్ 'మెసర్స్ దివ్య మహావితరక్' సంస్థపై దాడి చేసి, 2,279.7 లీటర్ల పతంజలి నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.20.20 లక్షలు. కల్తీ  తప్పుడు లేబులింగ్ (మిస్‌బ్రాండింగ్) అనుమానంతో 2,279.7 లీటర్ల పతంజలి ఆవు నెయ్యిని (రూ. 20.20 లక్షల విలువైనది) స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 (FSS Act) ప్రకారం మొదటి దృష్ట్యానే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ఎఫ్‌డీఏ గుర్తించింది.

19 సంస్థల లైసెన్సులు రద్దు:
శుభ్రత లోపించడం, ఆహార భద్రతా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడంతో ముంబై, అమరావతి, ఛత్రపతి శంభాజీనగర్ పరిధిలోని 19 స్వీట్లు, నామ్‌కీన్ మరియు మసాలా తయారీ యూనిట్ల లైసెన్సులు/రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో పనిచేయడం, కీటకాల నియంత్రణ (Pest control) రికార్డులు లేకపోవడం, ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం వంటివి ఈ చర్యలకు కారణమని తెలిపారు.

ఇదీ చదవండి: ఇది కదా సంబరాల దీపావళి ... సెలవులే సెలవులు!

టాటా 1mg, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నోటీసులు:
మరోవైపు, 'టాటా 1mg మెరైన్ కొల్లాజెన్ పౌడర్' ప్రకటనలు, లేబులింగ్‌లో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై టాటా 1mg హెల్త్‌కేర్, ఏసిఎఫ్ఓ ఫార్మాస్యూటికల్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: దారుణం : భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు!

అయితే,ఈ వ్యవహారంపై పతంజలి ఫుడ్స్ స్పందించింది. నెయ్యి నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం సేకరించారని, కానీ నాణ్యతలో లోపాలు ఉన్నట్లు నిర్ధారించే అధికారిక నివేదిక తమకు ఇంకా అందలేదని స్పష్టం చేసింది. నెయ్యి కల్తీ అయిందని ఇప్పుడే నిర్ధారించలేమని తెలిపింది. అంతేకాదు, ఈ ఆదేశాలు నేరుగా పతంజలి కంపెనీకి కాకుండా, నెయ్యి సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్‌కు జారీ అయ్యాయని వెల్లడించింది.

ఇదీ చదవండి : డాగ్‌ ఎటాక్‌ : రక్తసిక్తమైన నటి ముఖం, మాయని మచ్చ..అందుకే!
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)