Breaking News

పెళ్లి వేడుకలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి!

Published on Tue, 03/12/2024 - 06:43

మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు రాంగ్ సైడ్ నుండి ఓవర్‌టేక్ చేసి, వివాహ వేడుకలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. 

సుల్తాన్‌పూర్ ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వివాహ వేడుకలకు లైట్లు మోసే కూలీలు ప్రమాదం బారినపడ్డారని సుల్తాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రజత్ సారథే తెలిపారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం రాత్రి 10 గంటలకు ఖమారియా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైసెన్ కలెక్టర్ అరవింద్ దూబే తెలిపారు. 

ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారని కలెక్టర్ పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వైద్య చికిత్స అందించేందుకు భోపాల్‌కు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.
 

Videos

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)