Breaking News

ఎస్‌ఐఆర్‌ ఉద్యోగుల మృతి వెనుక ఈసీ హస్తం ఉంది 

Published on Sat, 11/29/2025 - 06:25

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)కు సంబంధించిన 40 మంది మరణించారని టీఎంసీ శుక్రవారం భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీని వెనుక రాష్ట్రంలోని పోల్‌ ప్యానెల్‌ చీఫ్‌ హస్తం ఉందని ఆరోపించింది. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓబ్రియన్‌ నేతృత్వంలో పదిమంది ఎంపీల ప్రతినిధి బృందం శుక్రవారం సీఈసీ అధికారులను కలిసింది. 

అనంతరం మీడియాతో మాట్లాడిన ఓబ్రియన్‌.. తమ పార్టీ ఐదు ప్రశ్నలను సీఈసీ ముందుంచుందని, కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు. తాము ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకించడం లేదని, ఈసీ పనిచే స్తున్న తీరుపై తమకు అభ్యంతరం ఉందని నొక్కి చెప్పారు. కమిషన్‌ దానిని కేవలం ఆరోపణలుగా తోసిపుచ్చిందని లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు. సీఈసీని కలిసిన ప్రతినిధి బృందంలో లోక్‌సభ ఎంపీలు శతాబ్దిరాయ్, కళ్యాణ్‌ బెనర్జీ, ప్రతిమా మండల్, సజ్దా అహ్మద్, రాజ్యసభ ఎంపీలు డోలా సేన్, మమతా ఠాకూర్, సాకేత్‌ గోఖలే, ప్రకాష్‌ చిక్‌ బారిక్‌ ఉన్నారు. 

ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ విధుల్లో నిమగ్నమైన బూత్‌ స్థాయి అధికారులు మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు ఈ సంఖ్య అధికంగా ఉంది. ఒక్క పశ్చిమబెంగాల్‌లోనే 40 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఎల్‌ఓల మరణాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా ఇతర ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎస్‌ఐఆర్‌ సంస్కరణకాదని, విజయం కోసం బీజేపీ చేస్తున్న నియంతృత్వ పాలనని విమర్శిస్తున్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)