Breaking News

ఉద్యోగం కోసం ఎమ్మెల్యేపై దాడి?.. యువకుడు అరెస్ట్

Published on Mon, 11/03/2025 - 07:58

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌పై దాడి జరిగింది. సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఎమ్మెల్యే నివాసంలోకి చొరబడిన ఒక యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోలీసులు ఆ యువకుడిని అభిషేక్ దాస్‌గా గుర్తించిన దరిమిలా అరెస్ట్‌ చేశారు.

ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జ్యోతిప్రియ మల్లిక్‌ను వెంబడించిన ఆ యువకుడు అతని ఇంటిలోనికి చొరబడి, హఠాత్తుగా ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లి, అతని పొత్తికడుపుపై బలంగా కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే షాక్‌నకు గురయ్యారు. వెంటనే తేరుకుని, కేకలు వేయడంతో అతని భద్రతా సిబ్బందితో పాటు సమీపంలోని ఇతరులంతా ఆ యువకుడిని పట్టుకుని, బిధాన్‌నగర్ పోలీసులకు అప్పగించారు.

పోలీసులు విచారణలో ఆ యువకుడు తాను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా ప్రాంతానికి చెందినవాడినని, ఉద్యోగం కోసం మల్లిక్‌తో మాట్లాడాలనుకున్నానని చెప్పాడు. మల్లిక్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో హబ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఆ యువకుడు నగరంలోని ఒక ఆసుపత్రిలో మానసిక వైద్య చికిత్స పొందుతున్నాడని, సాల్ట్ లేక్‌లోని మల్లిక్ ఇంటికి పలుమార్లు వెళ్లాడని పోలీసు అధికారి తెలిపారు.

ఎమ్మెల్యే మల్లిక్ విలేకరులతో మాట్లాడుతూ, ఆ యువకుడు ఇతర సందర్శకుల మాదిరిగానే తనను కలుసుకునేందుకు వచ్చాడని, అయితే అకస్మాత్తుగా ముందుకు దూకి, తనను కొట్టడంతో ఆశ్చర్యపోయానన్నారు. అతను మద్యం మత్తులో ఉన్నాడో లేదో తనకు తెలియదని, గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మల్లిక్ రెండేళ్ల క్రితం అటవీ మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి కేసులో కేంద్ర సంస్థలు ఆయనను అరెస్టు చేశాయి. 

ఇది కూడా చదవండి: ‘ట్రంప్‌ ఏం చేస్తారో..’: ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)