Breaking News

ఫిర్యాదులకు ‘ఆధార’మే

Published on Fri, 08/22/2025 - 14:00

న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన వాళ్లు దాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసే ఫిర్యాదులకు మద్దతుగా ఆధార్‌ను కూడా సమర్పించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయమై ఎన్నికల సంఘం పేర్కొన్న 11 డాక్యుమెంట్లతో పాటు ఆధార్‌ కూడా చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల జాబితా ముసాయిదాపై సకాలంలో అభ్యంతరాలు లేవనెత్తడంలో బిహార్‌లోని 12 రాజకీయ పార్టీలూ విఫలమయ్యాయంటూ గట్టిగా తలంటింది.

 ఈ విషయంలో వాటిది పూర్తిగా చేతగానితనమేనంటూ ఆక్షేపించింది. బిహార్‌లో తాము చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) సందర్భంగా ముసాయిదాపై ఒక్క పార్టీ కూడా తమవద్ద అభ్యంతరాలు దాఖలు చేయలేదన్న కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను ఉటంకిస్తూ ఈ మేరకు పార్టీలను గట్టిగా మందలించింది. పైపెచ్చు ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన పౌరులకు కనీసం ఈసీ వద్ద అభ్యంతరాలు దాఖలు చేయడంలో ఒక్క పార్టీ కూడా చురుగ్గా వ్యవహరించి సాయం చేయలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ప్రజలతో ఇంతటి దూరం ఎందుకు ఏర్పడిందంటూ ప్రశ్నించింది.

 ఈ విషయమై పార్టీలన్నీ ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ ఉద్బోధించింది. ఎస్‌ఐఆర్‌ కసరత్తును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘‘ఓటర్ల ముసాయిదాలో పేర్లు గల్లంతైన వారికి ఫారం–6 సాయంతో ఈసీ వద్ద ఫిర్యాదులు చేయడంలో పూర్తిస్థాయిలో సహకరించండి. ఆ మేరకు మీ పార్టీల కార్యకర్తలందరికీ స్పష్టమైన ఆదేశాలివ్వండి’’ అంటూ బిహార్‌లోని 12 పార్టీల నూ ఆదేశించింది. వ్యక్తిగతంగా అభ్యంతరా లను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు వీలు కల్పించాల్సిందిగా ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఐఆర్‌ కసరత్తు గడువు విషయమై ఈ దశలో ఎలాంటి మార్పుచేర్పులూ చేయలేదని స్పష్టం చేసింది.

 

బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై సుప్రీంకోర్టు విచారణ

బూత్‌ ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు?
బిహార్‌లో ఏకంగా 1.68 లక్షల మంది బూత్‌ స్థాయి ఏజెంట్లున్నట్టు ఈసీ నివేదించింది. అలాంటప్పుడు ఓటర్ల జాబితా నుంచి తొలగింపులకు సంబంధించి ఇప్పటిదాకా కేవలం రెండంటే రెండే అభ్యంతరాలు దాఖలవడంపై ధర్మాసనానికి విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పార్టీలు, అవి నియమించిన బూత్‌ స్థాయి ఏజెంట్లు ఏం చేస్తున్నట్టని ప్రశ్నించింది. ‘‘తొలగించిన 65 లక్షల ఓటర్లు మరణించారా, నివాసాలు మార్చారా, మరేమైనా జరిగిందా అన్నది తేలాలి. ఈ దిశగా అన్ని పార్టీల ఏజెంట్లు పూర్తి స్థాయిలో తనిఖీలు జరపాలి’’ అని ఆదేశించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)