Breaking News

మహువాకు మరోసారి చేదు అనుభవం : జస్టిస్‌ దీపాంకర్‌కు కౌంటర్‌

Published on Wed, 09/16/2026 - 17:29

తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రాకు  మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నదియాలోని తెహట్టా పోలీస్ స్టేషన్ వద్ద ఒక సమావేశానికి హాజరైన ఆమెను  బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు దారుణంగా అవమానించారు.  నల్ల జెండాలతో  ఆమెను చుట్టుముట్టి, ' గో బ్యాక్‌' అని నినాదాలతో హోరెత్తించారు.  దీంతో  హౌలియా పార్క్ కూడలి వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఈ సందర్బంగా మహువా అక్కడి నుండి వెళ్ళిపోతుండగా బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మహువాపై కోటిగుడ్లతో దాడిచేశారు.  పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నారు.  ఈ దాడిపై మహువా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  పోలీసుల అనుమతితో తన నియోజకవర్గానికి సమావేశానికి  వచ్చిన తనను అడ్డుకున్నారని విమర్శించారు. పోలీసుల సమక్షంలో  BJP కార్యకర్తలు తనపై కోడిగుడ్లు విసిరారని మండిపడ్డారు.

అంతేకాదు మీ సలహా ప్రకారం, ఒక స్వాతంత్ర్య సమరయోధుడు తూటాలను ఎదుర్కొన్నట్లే నేను వారిని ఎదుర్కొన్నాను అంటూ కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టున్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తానుద్దేశించి ట్వీట్‌ చేశారు.  ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. 

ఇదీ చదవండి: ఒరాకిల్‌ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!

 

ఇదీ చదవండి: ఒరాకిల్‌ను వదిలేసిన టెకీ : ఏకంగా రూ. 9 కోట్ల వ్యాపారం

కాగా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్, మతపరమైన మనోభావాలు దెబ్బతీశారనే ఆరోపణలపై మహువా మొయిత్రిపై పశ్చిమ బెంగాల్‌లో  కేసు నమోదైంది. అయితే వ్యక్తిగతంగా హాజరైతే తన భద్రతకు ముప్పు  అని,ఈ గుడ్లతో దాడి చేసే అవకాశం ఉందంటూ  వర్చువల్ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు తూటాలను ఎదుర్కొన్నారు, మీరేమో గుడ్లకే భయపడుతున్నారా? అని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. అంతేకాదు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది కూడా. 

ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)