Breaking News

కోల్‌కతా మెస్సీ ఈవెంట్‌ : టికెట్‌ ధరలు వాపసు

Published on Sat, 12/13/2025 - 18:05

కోల్‌కతా, సాక్షి:  కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో  ఫుట్‌ బాల్‌ లెజెండ్‌ లియెనెల్‌ మెస్సీ  కార్యక్రమం గందరగోళంగా మారింది. తమ అభిమాన క్రీడాకారుడిని చూడటానికి వచ్చేందుకు నిర్వహణా లోంపతో  జనం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదీ 20 నిమిషాల్లోనే లియోనెల్ మెస్సీ వేదిక నుండి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. చివరికి పోలీసుల జోక్యంతోవారిని అదుపు  చేశారు. అయితే  ఎంతో ఖరీదు పెట్టి టికెట్లను కొని, దూర ప్రాంతాలనుంచి వచ్చినప్పటికీ, కనీసం మెస్సీ ముఖం కూడా చూడలేకపోయామని చాలామంది అభిమానులు ఆగ్రమం  వ్యక్తం చేశారు.

టికెట్‌ డబ్బులు వాపసు
మరోవైపు లియోనెల్ మెస్సీ GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేశారు. కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అంతేకాదు అభిమాలను టికెట్‌ రుసుమును నిర్వాహకులు వెనక్కి ఇస్తారని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే  ఈ రీఫండ్‌ ఎలా జరుగుతుంది అనేది పరిశీలించాలన్నారు.

చదవండి: రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్‌ పైర్‌

 

దీనిపై స్పందించిన రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్‌కతా క్రీడాభిమానులకు ఇదొక చీకటి రోజుగా వ్యాఖ్యానించారు. నిర్వాహక లోపం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనీ, దీనికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అలాగే ముందుజాగ్రత్తలు తీసుకోని  పోలీసు అధికారును సస్పెండ్‌  చేయాలని కూడా అన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, దోషులను అరెస్టు చేయాలన్నారు.ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వాపసు ఇవ్వాలని, స్టేడియం ,ఇతర బహిరంగ ప్రదేశాలకు జరిగిన నష్టానికి నిర్వాహకులపై ఛార్జీలు విధించాలని, పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని గవర్నర్ అన్నారు.

ఇదీ చదవండి: 90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే!


 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)