Breaking News

మరో స్లీపర్‌ బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి

Published on Tue, 11/18/2025 - 11:49

కాన్పూర్: దేశంలో తరచూ చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం కాన్పూర్ సమీపంలోని అరౌలి ప్రాంతంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఢిల్లీ నుండి బిహార్‌లోని సివాన్‌కు వెళ్తున్న డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం బస్సు అతివేగంగా సెంట్రల్ డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. పగిలిన గాజు ముక్కలు, చెల్లాచెదురుగా పడిన సామాను, గాయపడిన ప్రయాణికులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్రలోకి జారుకోవడమేననే ఆరోపణలున్నాయి. ‍ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు కనిపించాడని సాక్షులు తెలిపారు. కాగా ఘటన జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ పారిపోయారు. ఈ విషయాన్ని అరౌలి పోలీసు ఇన్‌స్పెక్టర్ జనార్ధన్ సింగ్ యాదవ్ ధృవీకరించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. బోల్తా పడిన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆరు అంబులెన్స్‌లలో గాయపడిన వారిని బిల్‌హౌర్  ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారని వైద్యులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని తదుపరి చికిత్స కోసం కాన్పూర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. డాక్టర్ సంజీవ్ దీక్షిత్, ఏసీపీ మంజయ్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఆస్పత్రులోని గాయపడిన వారిని పరామర్శించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: బిహార్‌ ‘ఫలితం’పై వివాదం.. మేనల్లుడు హత్య

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)