Breaking News

పూడ్చలేని లోటు... అందెశ్రీ అస్తమయంపై మోదీ ట్వీట్‌

Published on Mon, 11/10/2025 - 16:29

తెలంగాణ రాష్ట్ర ఐకానిక్ గీతం "జయ జయ హే తెలంగాణ" రచయిత,  ప్రఖ్యాత కవి అందె శ్రీ  (Ande Sri )ఆకస్మిక మరణంపై ప్రధానమంత్ర నరేంద్ర మోదీ  ( Narendra Modi) సంతాపం వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో  ఒక సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

‘‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి,ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ ట్వీట్‌ చేశారు. 

(Ande Sri: చివరి కోరిక తీరకుండానే.. వెళ్లిపోయావా ఎల్లన్నా!)

 కాగా  సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని  నివాసంలో అనారోగ్యానికి గురైన  అందెశ్రీని కుటుంబ సభ్యులు  గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు  వైద్యులు ప్రకటించారు. తెలంగాణకు ఇది విచారకరమైన రోజు అంటూ పలువురు సాహిత్య, సంగీత అభిమానులు సంతాపం   తెలిపారు. శక్తివంతమైన మాటల ద్వారా తెలంగాణకు ఆత్మీయ స్వరాన్ని అందించిన కవి అందేశ్రీ మరణం పట్లపై పలువురురాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన రచనలు తరతరాలుగా స్ఫూర్తినిస్తాయంటూ అందెశ్రీ  కుటుంబానికి, అభిమానులకు హృదయపూర్వక సంతాపం  తెలిపారు. 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)