Breaking News

ప్రేమంటే ఇదేరా.. ప్రియుడి కోసం శ్రీలంక యువతి సాహసం

Published on Fri, 08/15/2025 - 19:28

అన్నానగర్: ప్రేమించిన యువకుడి కోసం ఓ యువతి ఏకంగా దేశం దాటి వచ్చిన ఉదంతమిది. ప్రియుడి కోసం ప్రియురాలు తన దగ్గరున్న నగలు అమ్ముకుని మరీ శ్రీలంక నుంచి నకిలీ పడవలో భారత్‌కు వచ్చిన ఘటన బుధవారం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటిలో జరిగింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. అరిచలమునై బీచు బుధవారం ఉదయం ఓ యువతి శరణార్థిగా వచ్చిందని కోస్టల్ పోలీసులకు సమాచారం అందింది.

ఆ మహిళను కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. పోలీసుల కథనం మేరకు.. శ్రీలంకలోని మన్నార్‌కు చెందిన విదుర్షియ (25) తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా పళనిలో ఒక శరణార్థి శిబిరంలో తన తల్లి, తండ్రితో కలిసి నివసించేది. ఆ సమయంలో ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. గత ఏప్రిల్లో ఆమె శ్రీలంకకు వెళ్లగా, తిరిగి అక్కడి నుంచి భారత్‌కు రావడానికి వీసా పొందలేకపోయింది.

అయితే ఆమె తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి నకిలీ పడవలో రావాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఆ మహిళ తన నగలను అమ్మి వచ్చిన నగదుతో తలైమన్నార్ బీచ్ నుంచి ఓ ప్లాస్టిక్ పడవ ఎక్కి అరిచల్ మునైకి చేరుకుంది. దర్యాప్తు అనంతరం ఆ యువతిని మండపం శరణార్థి శిబిరానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)