కొడుకులు కాదు.. దుర్మార్గులు

Published on Sat, 12/20/2025 - 11:31

ఆ పెద్దాయన్ని పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. హమ్మయ్యా.. అనుకుంటున్న టైంలో వారం వ్యవధిలోనే మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఈసారి ఆస్పత్రికి వెళ్లడం బాగా ఆలస్యమై ప్రాణం పోయింది. అయితే కొడుకుల దొంగ చూపులు.. పొంతన లేని సమాధానాలు.. వాళ్ల కాల్‌ డాటా.. తండ్రి ఇన్సూరెన్స్‌ సొమ్ము కోసం పడ్డ తాపత్రయం.. ఇది పక్కా స్కెచ్చేసి చేసిన హత్య అని బయటపెట్టాయి. 

తండ్రికి రూ.3 కోట్ల దాకా బీమా చేయించి.. ఆపై పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. రకరకాల వ్యాపారాలు చేసి.. అప్పుల పాలైన ఇద్దరు తనయులు తమ స్నేహితుల సాయంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు నిర్ధారించారు. ఒకసారి స్థానికులు తండ్రిని రక్షించగా.. మరోసారి ఎలాంటి ఆటంకం లేకుండా తమ ప్లాన్‌ను అమలు పరిచారు ఈ దుర్మార్గులు. ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే.. 

పొదటూర్‌పేట్‌ గ్రామానికి చెందిన ఈపీ గణేశన్‌(56).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్‌ 22వ తేదీన పాము కాటుతో ఇంట్లోనే ఆయన చనిపోయారు. అయితే.. వారం తిరగకుండానే కుటుంబం ఇన్సూరెన్స్‌ కోసం క్లెయిమ్‌ చేయడంతో ఆ కంపెనీ వాళ్లకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఈ విషయం చేరవేయడం.. వాళ్లు దర్యాప్తును ముమ్మరం చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. 

గణేష్‌ కొడుకు మోహన్‌రాజ్‌(26), హరిహరన్‌(27) ప్రైవేట్‌ ఉద్యోగులు. అయితే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, ఇతర విలాసాల కోసం అడ్డగోలుగా అప్పులు చేసి ఉన్నారు. ఈ క్రమంలో తండ్రి పేరిట ఇన్సూరెన్స్‌లు చేయించి హతమార్చాలనే దుర్మార్గపు ఆలోచన చేశారు. దీనికి నలుగురు స్నేహితుల సాయం కోరారు. 

అక్టోబర్‌ 15వ తేదీన ఒక పామును గణేశన్‌ మీదకు వదిలారు. అది కాలి మీద కాటేయడంతో.. ఆయన నొప్పితో అరిచారు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించి రక్షించారు. వారం తర్వాత ఈసారి మరింత విషపూరితమైన పామును తెచ్చి మెడ మీద కాటు వేయించారు. ఈసారి ఆయన అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. తలుపులు వేసి ఉండిపోయారు. ఆపై చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో పాము పగ బట్టి చంపిందంటూ స్థానికంగా ప్రచారం జరిగింది.

అయితే.. వారం తిరగకుండానే ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం కొడుకులు క్లెయిమ్‌కు దిగడంతో ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీకి అనుమానం వచ్చింది. ఏజెంట్‌తో దర్యాప్తు చేయించే క్రమంలో వరుసగా పాము కాటుకు గురికావడం, ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడం లాంటి విషయాలు తెలిశాయి. దీంతో పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 

డిసెంబర్‌ 6వ తేదీన నార్త్‌ జోన్‌ ఐజీ అస్రా గార్గ్‌.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ ఇద్దరు కొడుకుల ఫోన్‌ కాల్స్‌ రికార్డింగులు.. ఆర్థిక లావాదేవీల ఆధారంగా తండ్రిని పాము కాటుతో హత్య చేయించినట్లు నిర్ధారించుకున్నారు. నిందితులిద్దరితో పాటు వాళ్లకు సహకరించిన నలుగురిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)