Breaking News

దగ్గు సిరప్‌ వివాదం.. కాంచీపురం యూనిట్‌ మూసివేత 

Published on Thu, 10/09/2025 - 06:00

చెన్నై/కాంచీపురం: మధ్యప్రదేశ్‌లో 20 మంది వరకు చిన్నారుల మృతికి కారణమని భావిస్తున్న దగ్గు మందు తయారీ ప్లాంట్‌ను తమిళనాడు ప్రభుత్వం మూసివేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ లో సిరప్‌ కోల్డ్రిఫ్‌ తాగిన చిన్నారులు కిడ్నీలు ఫెయిలై మృత్యువాత పడుతున్నారన్న ఆరోపణల తో ఈ సిరప్‌ విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీనే నిషేధం విధించింది. మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ను తొలగించాలని స్పష్టం చేసింది. 

సిరప్‌లో ప్రమాదకర రసాయనా లున్నా యంటూ పరీక్షలు జరిపిన రాష్ట్ర ఔషధ విభాగం ప్రకటించింది. తక్షణమే కోల్డ్రిఫ్‌ ఉత్పత్తిని నిలిపి వేయాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మందును మధ్యప్రదేశ్, కేరళ కూడా నిషే ధించాయి. కోల్డ్రిఫ్‌ సిరప్‌ విక్రయాలను నిలిపివే యా లంటూ పుదుచ్చేరి, ఒడిశా ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసింది. 

కోల్డ్రిఫ్‌లో ప్రమాదకర డై ఇథిలీన్‌ గ్లైకాల్‌ 48.6 శాతం కనిపించడంపై వివరణ ఇవ్వాలని కంపెనీకి రెండో సారి నోటీసు ఇచ్చామని మంత్రి మా సుబ్రమణియన్‌ చెప్పారు. ఇప్పటికే ఇదే విషయంలో ఈ నెల 3న మొదటి నోటీసు పంపించామన్నారు. కంపెనీ వివరణ ఎలా ఉన్నా చట్టపరమైన క్రిమినల్‌ చర్యలు మాత్రం తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నోటీసులకు స్పందించని ఆ కంపెనీ పూర్తిస్థాయి మూసివేతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.

చెన్నైలో మధ్యప్రదేశ్‌ సిట్‌
కోల్డ్రిఫ్‌ మరణాలపై దర్యాప్తునకు ఏర్పాటైన మధ్యప్రదేశ్‌ సిట్‌ బృందం చెన్నైకి చేరుకుంది. చెన్నైలోని ఫార్మా కంపెనీ కార్యాలయానికి వెళ్లి, అవసరమైన పత్రాలను సేకరించింది. అదేవిధంగా, కాంచీపురంలోని సీల్‌ వేసిన కంపెనీ యూనిట్‌ను పరిశీలించింది. అవసరమైన వివరాలను తెల్సుకుంది. 
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)