Breaking News

ఘోర ప్రమాదం.. లోయలోకి కారు దూసుకెళ్లి 8 మంది మృతి

Published on Tue, 08/30/2022 - 18:27

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వారా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్‌యూవీ కారు అదుపుతప్పి భారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

ఎస్‌యూవీ కారు.. చింగమ్‌ ప్రాంతం నుంచి ఛత్రూకు వెళ్తోందని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో బొండా గ్రామానికి సమీపంలో ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయినట్లు చెప్పారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరోవైపు.. కారు లోయలో పడి 8 మంది మృతి చెందిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌. ప్రమాదం జరగటం దురదృష్టకరమన్నారు. అన్ని విధాల అవసరమైన సాయం అందిస్తామన్నారు.

ఇదీ చదవండి: ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు

Videos

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి

ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..

మా నాయకుడు జగన్ అని గర్వంగా చెప్తాం రాచమల్లు గూస్ బంప్స్ కామెంట్స్

టీటీడీ భూములు ప్రైవేట్ హోటల్స్ కు అప్పగింత బాబుపై శ్రీనివాసానంద సరస్వతి ఫైర్

కేసీఆర్, రేవంత్ భేటీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

కడప రెడ్డెమ్మ పైసా వసూల్..!

అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్

రూ. 1000 కోట్లకు ప్లాన్ చేసిన.. రజినీకాంత్ జైలర్ 2

అసలు నీకు బుర్ర ఉందా? బీటెక్ రవిని ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

Nagarjuna Yadav: రియల్ ఎస్టేట్లకు బంపర్ ఆఫర్ ప్రభుత్వమే భూములు దొంగతనం

Photos

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)