Breaking News

భారీగా ఓట్లను తొలగిస్తే  మేం జోక్యం చేసుకుంటాం 

Published on Wed, 07/30/2025 - 05:58

న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటర్ల జాబితాలో సమూల ప్రక్షాళన ధ్యేయంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భారీ స్థాయిలో ఓట్లను తొలగిస్తే మాత్రం తాము కచి్చతంగా జోక్యంచేసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఓటర్ల గుర్తింపును తనిఖీచేసే ప్రక్రియలో ఆధార్‌ కార్డ్, ఓటర్‌ కార్డులను చేర్చాలన్న పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగీ్చల సుప్రీంకోర్టు ధర్మాసనం వాదోపవాదనలను ఆలకించింది. చట్టప్రకారం ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసే అసాధారణ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.

 ‘‘తమకు ఇప్పటికే ఓటు ఉందని తెలియజేస్తూ ఎనుమరేషన్‌ దరఖాస్తును 65 లక్షల మంది సమరి్పంచలేదు. అంతమాత్రం చేత వీళ్లందరి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారా? వీళ్లంతా ఎవరో ఈసీకి తెలియదా?’’ అని పిటిషనర్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌సిబల్‌ వాదించారు. దీంతో ధర్మాసనం జోక్యంచేసుకుంది. ‘‘ 

చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంది. ఓటరు ముసాయిదా జాబితాలో ఏవైనా తప్పులుంటే మా దృష్టికి తీసుకుని రండి. ముసాయిదాలో పేర్లు లేకపోవడం కారణంగా ఓట్లను కోల్పోతున్న ఒక 15 మందిని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి. దరఖాస్తు ఇవ్వనంత మాత్రాన చనిపోయారని ఆ జాబితా నుంచి ఎవరి పేర్లయితే తీసేశారో వాళ్ల వివరాలు మాకు ఇవ్వండి. అలాగే దరఖాస్తు ఇవ్వని కారణంగా జాబితాలో పేరు గల్లంతైన వారి వివరాలూ సమర్పించండి’’ అని సిబల్‌కు ధర్మాసనం సూచించింది.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)