Breaking News

హైవేలు పార్కింగ్‌ స్థలం కాదు: సుప్రీం కోర్టు

Published on Mon, 08/12/2024 - 16:45

ఢిల్లీ: శంభూ సరిహద్దు రహదారిని పాక్షికంగా తెరవాలని సుప్రీం కోర్టు హర్యానా, పంజాబ్‌ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలు  శంభూ సరిహద్దు జిల్లాలు పాటియాల, అంబాల ఎస్సీలతో భేటీ అయి వారం రోజుల లోపు శంభూ సరిహద్దు హైవేను తెరవాలని ఆదేశించింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు క్రమంలో సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. హైవేలు ఉన్నది పార్కింగ్‌ స్థలం కోసం కాదని పేర్కొంది. వెంటనే పంజాబ్‌ ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి.. హైవే మీద నిలిపిన ట్రాక్టర్లను తొలగించేలా చూడాలని సూచించింది.

అత్యవసర సేవలు అంబులెన్స్‌ రాకపోకలు, వృద్దులు, మహిళలు, విద్యార్థినీలు, స్థానిక ప్రయాణికుల అవసరాల కోసం శంభూసరిహద్దును పాక్షికంగా ఓపెన్‌ చేయాలని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా రాజకీయాలతో  సంబంధంలేనివారితో ఓ కమిటీ ఏర్పాటు చేసి రైతులతో చర్చలతో జరపడానికి చేసిన కృషి​కి ఇరు రాష్ట్రా ప్రభుత్వాలను సుప్రీకోర్టు అభినందించింది.  

శంభు సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులతో మాట్లాడేందుకు ఏర్పాటు చేయాల్సిన ప్యానెల్ నిబంధనలపై కూడా ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక.. పంటలకు మద్దతు ధర డిమాండ్‌ చేస్తూ.. పంజాబ్‌, హర్యానా రైతులు పెద్దఎత్తున దేశ రాజధాని ఢిల్లీ చేరుకొవాలని ప్రయత్నించగా వారిని పోలీసులు శంభుసరిహద్దుల్లో అడ్డుకున్నారు. దీంతో ఫిబ్రవరి 13 నుంచి శంభు సరిహద్దుల్లో రైతులు తమ ట్రాక్టర్లను రహదారికి అడ్డుపెట్టి నిరసన తెలుపుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)