Breaking News

నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ

Published on Mon, 04/07/2025 - 11:04

ఢిల్లీ : వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌­రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌  పిటిషన్‌ను జస్టిస్ జేబీ  పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ జరపనుంది.

మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ మిథున్‌­రెడ్డి గత నెలలో ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఏపీ సీఐడీ తరుఫు న్యాయవాది మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఈ ​వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని చెప్పారు. దీంతో, మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీం కోర్టులో ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)