Breaking News

ఢిల్లీలో దీపావళి ధమాకా..? 

Published on Mon, 10/13/2025 - 06:23

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి టపాసుల మోత మోగే అవకాశాలున్నాయి. వాయు కాలుష్యం దృష్ట్యా ఏళ్లుగా కొనసాగుతున్న సంపూర్ణ నిషేధంపై బీజేపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రజల మతపరమైన, సాంస్కృతిక మనోభావాలను గౌరవిస్తూ, పర్యావరణానికి హాని కలగని రీతిలో హరిత (గ్రీన్‌) టపాసులకు అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు టపాకాయలపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. 

గ్రీన్‌ కాకర్స్‌కే అనుమతి! 
సంపూర్ణ నిషేధం బదులుగా, ప్రభుత్వం నిర్దేశించిన, ధ్రువీకరించిన గ్రీన్‌ క్రాకర్స్‌ను మాత్రమే పరిమిత సమయం పాటు కాల్చేందుకు అనుమతించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. పండుగ ఉత్సాహాన్ని దెబ్బతీయకుండా, అదే సమయంలో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేసేలా ఈ మధ్యేమార్గం ఉత్తమమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యాలని, అందుకే కేవలం తక్కువ ఉద్గారాలు వెలువరించే హరిత టపాసుల వైపే మొగ్గు చూపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. 

ఫలించని సంపూర్ణ నిషేధం 
కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంపూర్ణ నిషేధం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ప్రభుత్వం వాదించనుంది. నిషేధం ఉన్నప్పటికీ, ప్రజలు అక్రమ మార్గాల్లో ప్రమాదకరమైన, అధిక కాలుష్యాన్ని వెదజల్లే టపాసులను కొనుగోలు చేసి కాలుస్తున్నారని, దీనివల్ల కాలుష్య తీవ్రత తగ్గకపోగా కొన్నిసార్లు మరింత పెరుగుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కఠినమైన నిషేధం కంటే నియంత్రిత పద్ధతిలో గ్రీన్‌ క్రాకర్స్‌ను అనుమతించడమే ఆచరణాత్మక పరిష్కారమని బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచి్చంది. 

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 
సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి, గ్రీన్‌ క్రాకర్స్‌కు అనుమతిస్తే నిబంధనల అమలులో ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరం అంతటా పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు.  
 

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)