Breaking News

నీట్‌ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం

Published on Thu, 07/23/2026 - 17:43

సాక్షి, న్యూఢిల్లీ:  నీట్ పేపర్ లీకేజీ అక్రమాలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయవాదులు ముందుకొచ్చారు. గురువారం లంచ్ విరామంలో 'సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్‌స్టిట్యూషన్' బ్యానర్ కింద  నిరసనకారులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ ప్రవేశికను (Preamble) పఠించారు.  

ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఎస్. మురళీధర్ (ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి) Supreme Court Bar Association (SCBA) అధ్యక్షుడు డాక్టర్ వికాస్ సింగ్ లీడ్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులపై పోలీసుల దారుణ హింసాకాండను, బలప్రయోగాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా నిలవడం న్యాయవాదుల రాజ్యాంగ బాధ్యత అని  ప్రముఖ న్యాయవాదిఇందిరా జైసింగ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: స్టీల్‌ సిటీ అందాలకు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ ఫిదా, వైరల్‌ వీడియో


 

 నీట్‌ పేపర్‌లీక్‌ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా  చేయాలని, ఆత్మహత్య చేస్తున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం డిమాండ్స్‌తో  సీజేపీ ఆధ్వర్యంలో  జూన్ 20 నుండి కొనసాగుతున్న ఈ నిరసనకు వాతావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్, AISA విద్యార్థులు కూడా మద్దతు తెరిపిస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే పార్లమెంట్‌  మార్చ్‌ సందర్భంగా  విద్యార్థులు ఆందోళన కారులపై పోలీసుల దమనకాండపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనాయి.  మరోవైపు ఈ డిమాండ్లతో నిరసన కారులపై పెట్టిన FIRల ఉపసంహరణ వరకు ఆందోళన విరమించేది లేదని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.

ఇదీచదవండి: సీజేపీపై వివాదాస్పద పోస్ట్‌ : ఎవరీ ఇన్‌స్టా స్టార్‌ సోనియా

ప్రధాని మోదీ  స్పందన
పరీక్షా పత్రాల లీకేజీ కేసులలో నిందితులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా  గురువారం ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)