Breaking News

ఎల్‌ నినో ఎఫెక్ట్‌: భూమికి పొంచి ఉన్న మరో ముప్పు?!

Published on Mon, 07/27/2026 - 11:56

ప్రపంచం ఇప్పటికే వాతావరణ మార్పుల సెగను ఎదుర్కొంటోంది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వేడిగాలులు, కరవు పరిస్థితులు.. మరోవైపు ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్న తుపాన్లు, వరదలు అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పసిఫిక్‌ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న ఓ పరిణామం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. సూపర్‌ ఎల్‌నినో.. గాడ్జిల్లా ఎల్‌నినో అంటూ చర్చకు వచ్చిన ఈ వాతావరణ ప్రభావం 2026పైనే అందరి దృష్టిని మళ్లించింది. అయితే శాస్త్రవేత్తల తాజా అంచనాలు మాత్రం అసలు ప్రభావం మరింత ఆలస్యంగా కనిపించే అవకాశాన్ని సూచిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే.. 2026 ప్రపంచంలో రెండో అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉందని అంటోంది. మరి మొదటి ఏడాది?. దానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని అంటున్నారు. 2027 మాత్రం గత శతాబ్దానికి పైగా ఉన్న ఉష్ణోగ్రత రికార్డులను సవాలు చేసే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా పసిఫిక్‌ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్‌ నినో పరిస్థితులను పేర్కొంటున్నారు.

సముద్రంలో దాగిన వేడి.. భూమిపై ప్రభావం
ఎల్‌నినో అనేది పసిఫిక్‌ మహాసముద్రంలో సహజంగా సంభవించే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. ఆ వేడి ప్రపంచవ్యాప్తంగా గాలుల కదలికలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో భారీ స్థాయిలో వేడి నిల్వ ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. సముద్రం లోపల పేరుకుపోయిన ఈ వేడి క్రమంగా పైకి వచ్చి వాతావరణ వ్యవస్థలోకి చేరినప్పుడు.. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత ఎల్‌ నినోను 1997-98లో నమోదైన అత్యంత బలమైన ఎల్‌ నినోతో శాస్త్రవేత్తలు పోలుస్తున్నారు. అప్పట్లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, వరదలు, కరువులు సంభవించాయి. అయితే ఈసారి పరిస్థితులు మరింత భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు భూమి ఇప్పటికే గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో మరింత వేడెక్కిపోయింది.

2026లో మొదలై.. 2027లో తీవ్ర ప్రభావం?

ఎల్‌ నినో ప్రభావం ఏర్పడిన వెంటనే బయటపడదు. సముద్రంలో మార్పులు చోటుచేసుకున్న తర్వాత వాటి ప్రభావం వాతావరణ వ్యవస్థపై పడేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే సాధారణంగా ఎల్‌ నినో ఏర్పడిన ఏడాది కంటే.. తర్వాతి ఏడాదిలో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే కారణంగా 2026లో బలపడుతున్న ఎల్‌ నినో ప్రభావం 2027లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణంలో పెరిగిన గ్రీన్‌హౌస్‌ వాయువులు వేడిని బంధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎల్‌ నినో ప్రభావం కలవడంతో ఉష్ణోగ్రతలు గత అంచనాలను మించి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మారనున్న ప్రపంచ వాతావరణ ముఖచిత్రం!
బలమైన ఎల్‌ నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను ప్రభావితం చేయగలదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర పొడి పరిస్థితులు ఏర్పడవచ్చు. దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఎండలు, కరవు పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫాన్ల తీవ్రత, వాటి ప్రయాణ మార్గాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

భారత్‌పై ఎలాంటి ప్రభావం?
ఎల్‌ నినో ప్రభావం భారత వాతావరణంపై కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం కనిపించే సందర్భాలు గతంలో ఉన్నాయి. కొన్ని బలమైన ఎల్‌ నినో పరిస్థితుల సమయంలో వర్షపాతం తగ్గిన ఉదాహరణలు నమోదయ్యాయి. అయితే భారత రుతుపవనాలను ఎల్‌ నినో ఒక్కటే నిర్ణయించదు. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు, స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ ఎల్‌ నినో బలపడితే వ్యవసాయం, నీటి వనరులు, వేసవి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సహజ మార్పా? మానవ తప్పిదాల ప్రభావమా?
ఎల్‌ నినో అనేది సహజంగా జరిగే ప్రక్రియే అయినప్పటికీ.. ప్రస్తుతం దాని ప్రభావం తీవ్రంగా కనిపించడానికి గ్లోబల్‌ వార్మింగ్‌ కూడా ఒక ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం వల్ల పెరుగుతున్న కార్బన్‌ ఉద్గారాలు భూమి ఉష్ణోగ్రతలను నిరంతరం పెంచుతున్నాయి. దీంతో సహజ వాతావరణ మార్పులు వచ్చిన ప్రతిసారి వాటి ప్రభావం గతంతో పోలిస్తే మరింత తీవ్రంగా కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది.

మరో వేడి రికార్డుకు రంగం సిద్ధమా?
ప్రస్తుత అంచనాలు నిజమైతే.. 2027 భూమి చరిత్రలోనే అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం ఉష్ణోగ్రతల రికార్డు మాత్రమే కాదు.. మారుతున్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు ఒక ముందస్తు హెచ్చరికగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో పేరుకుపోతున్న వేడి రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. భూమి వేడెక్కే వేగం ఇంకా తగ్గడం లేదు. కొత్త ఉష్ణోగ్రత రికార్డులకు వాతావరణం మరోసారి వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)