Breaking News

వీడియో వైరల్‌: అందరిని నవ్వించి.. చివరికి కన్నీళ్లను మిగిల్చిన విద్యార్థిని

Published on Sun, 04/06/2025 - 11:56

ముంబై: సంతోషంగా, ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో స్మృతులతో సంతోషంగా జరుగుతున్న ఫెర్‌వెల్‌ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. వేదికపై ప్రసంగిస్తున్న ఓ విద్యార్థిని గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటనలో బాధిత విద్యార్థినికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ ప్రాణాలు కోల్పోవడంపై తోటి విద్యార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు.

మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలో పరండా పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పరండా ఆరాజి షిండే కాలేజీలో ఫేర్‌వెల్ పార్టీ విషాదంగా ముగిసింది. వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని వర్ష ఖరత్ (20) వేదికపై ప్రసంగిస్తున్నారు. అప్పటివరకు విద్యార్థులు, లెక్చరర్ల గురించి మాట్లాడారు. మధ్య మధ్యలో తన ప్రసంగంతో అటు విద్యార్థుల్ని, ఇటు లెక్చరర్లను నవ్వించారు.

 

అయితే అప్పటి వరకు అందరిని నవ్వించి వర్ష మాట్లాడుతూ కుప్పకూలారు. ఫెర్‌వెల్‌ పార్టీలో పాల్గొన్న విద్యార్థులు తీసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థిని కుప్పకూలిపోవడంతో అప్రమత్తమైన తోటి విద్యార్థులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం పరండా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే విద్యార్థిని వర్ష మరణించినట్లు ప్రకటించారు. 

ప్రాథమిక సమాచారం ప్రకారం, వర్ష ఎనిమిదేళ్ల వయసులో గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత 12 ఏళ్లుగా ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, మందులు కూడా వాడటం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణంగా ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు (సడెన్ కార్డియాక్ అరెస్ట్) రావడం వల్ల బ్రెయిన్ డెత్ వచ్చి మృతి చెందిందని నిపుణులు అనుమానిస్తున్నారు. వర్ష మరణంపై కాలేజీ యాజమాన్యం తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె స్మృతిగా ఒక్కరోజు సెలవు ప్రకటించారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)