Breaking News

మాల్‌లో మంటలు.. లిఫ్ట్‌లో విద్యార్థి చిక్కుకుని..

Published on Sat, 07/05/2025 - 13:13

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో లిఫ్ట్‌లో చిక్కుకున్న ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. నాలుగు అంతస్తుల వాణిజ్య సముదాయ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. తొలుత ఫ్యాబ్రిక్‌, కిరాణ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఫలితంగా విద్యుత్ నిలిచిపోయి లిఫ్ట్  ఆగిపోయింది. ఆ లిఫ్ట్‌లో చిక్కకున్నవిద్యార్థి కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్(25) ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చేందుకు పలు ఇబ్బందులు పడ్డారు. ఈ భవనంలో ఒకే  ప్రవేశ మార్గం,  ఒకే నిష్క్రమణ మార్గం ఉంది. వివిధ వస్తువుల స్టాక్‌తో మెట్ల మార్గం అంతా మూసుకుపోయింది.

దీంతో పైఅంతస్తులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దట్టమైన పొగ వెంటిలేషన్‌ను  అడ్డుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు గోడను బద్దలు కొట్టవలసి వచ్చింది. మొత్తం పదమూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో పాల్గొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ అనే అనుమాలున్నప్పటికీ, దర్యాప్తు తర్వాత  అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన మరోసారి వాణిజ్య ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా అవసరాలను గుర్తుచేస్తోంది. 

ఇది కూడా చదవండి: Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)