Breaking News

లక్నో: తప్పిన ఘోర విమాన ప్రమాదం

Published on Mon, 06/16/2025 - 10:12

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే.. వరుస ఉదంతాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా లక్నో ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. విమానం టైర్‌ భాగం నుంచి నిప్పు కణికలు ఎగసి పడ్డాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో 250 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హజ్‌ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే.. ల్యాడింగ్‌ సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ నుంచి నిప్పు కణికలు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానం ట్యాక్సీ వేకి చేరుకోగానే.. ప్రయాణికులందరినీ దించేశారు. 

ఎడమ టైర్‌ వద్ద ల్యాండింగ్‌ గేర్‌ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆర్పేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

జూన్‌ 12వ తేదీన అహ్మబాద్‌ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విమానాశ్రయం నుంచి లండన్‌ బయల్దేరిన విమానం టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో 33 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన యావత్‌ ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేసింది. ఈ ఘటనపై హైలెవల్‌ కమిటీతో భారత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)