Breaking News

శాంతికాముకుడిని,30 నేషన్-బిల్డింగ్ అవార్డులు : కావాలనే నేరగాడిగా

Published on Thu, 01/08/2026 - 19:45

న్యూఢిల్లీ:  ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు విద్యావేత్త‌, సామాజిక కార్య‌క‌ర్త  సోనమ్ వాంగ్‌చుక్ జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన భార్య గీతాంజలి జె ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఆంగ్మో పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు వాదించారు.  

హింసకు వ్యతిరేకంగా మాట్లాడి, జాతి నిర్మాణంలో 30 అవార్డులు అందుకున్న  సోనమ్ వాంగ్‌చుక్‌ను ఇప్పుడు నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నారని  ఆయన భార్య సుప్రీంకోర్టుముందు వాపోయారు. సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని సవాలు చేస్తూ సిబల్, ఆయన నిర్బంధానికి సంబంధించి పూర్తి కారణాలు అందించలేదనీ దీనికి వ్యతిరేకంగా  వాదించేందుకు సరైన అవకాశం  కూడా  ఎప్పుడూ ఇవ్వలేదని వాదించారు. నిర్బంధానికి కారణాలు నిర్బంధించబడిన వ్యక్తికి అందించకపోతే, ఆదేశం (నిర్బంధం) "విటియేటెడ్" అని చట్టం నిర్దేశిస్తుందని నొక్కి చెబుతూ, సిబల్ నిర్బంధం మరియు ఆధారాల సరఫరాపై చట్టాన్ని ప్రస్తావించారు

కాగా ప్రభుత్వాలకు ప్రజా శాంతి లేదా జాతీయ భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులపై ముందస్తు చర్య తీసుకునే అధికారం ఇచ్చే NSA చట్టం కింద గత ఏడాది సెప్టెంబర్ 26న అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆయనను జోధ్‌పూర్‌కు తరలించారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద రాష్ట్ర హోదా మరియు రక్షణలను డిమాండ్ చేస్తూ లడఖ్‌లోని లేహ్‌లో జరిగిన నిరసనల సందర్భంగా హింస చెలరేగడంతో  ఆయనపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు.దీనిపై అతని భార్య , విద్యావేత్త గీతాంజలి ఆంగ్మో అతని నిర్బంధాన్ని సవాలు చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంగ్మో తరపున  సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.  ఈ కేసువిచారణ  జనవరి 12న వాయిదా పడింది.

ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్‌!

వాంగ్‌ చుక్‌ వాదన"నిర్బంధానికి గల అన్ని కారణాలను అందించకపోతే,  రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 22 (5)  ఏకపక్ష అరెస్టు , నిర్బంధం నుండి రక్షణ కల్పిస్తుందని వాంగ్‌ చుక్‌ తెలిపారు. సెప్టెంబర్ 10న నేను నిరాహార దీక్షకు దిగాను. దీక్ష 15వ రోజున, హింసాత్మక సంఘటనలు జరిగాయి, దానితో నేను చాలా కలత చెంది24న నా నిరాహార దీక్షను విరమించాను , హింస ఆపాలని ఒక ప్రసంగం ఇచ్చాను.. 26న అదుపులోకి తీసుకున్నారు. 1922లో ఫిబ్రవరి 4న చౌరీ చౌరా సంఘటన తర్వాత బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయాలని మహాత్మా గాంధీ తీసుకున్న నిర్ణయంతో వాంగ్‌ చుక్‌ పోల్చుకున్నారు. అలాగే  తనను నేరస్థుడిగా చూపించడానికే వాస్తవాలను తారుమారు చేస్తున్నారన్న వాంగ్‌చుక్‌ వాదనను సిబల్  కోర్టుకు  తెలిపారు.

ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్‌, వీడియో వైరల్
 పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్‌ చేస్తే అస్థిపంజరం దొరికింది


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)