క్యాన్సర్‌తో కొడుకు మృతి: కోడలికి కన్యాదానం చేసిన మామగారు

Published on Thu, 07/09/2026 - 15:48

కోడళ్లను వేధించే అత్తమామల గురించి విన్నాం. కానీ కోడల్ని  కన్న కూతురి కంటే మిన్నగా  భావించి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన అత్తామామల గురించి తెలుసా? క్యాన్సర్‌ మహమ్మారి కొడుకును బలితీసుకుంటే, వారు కోడలికి అండగా నిలిచారు. అంతేకాదు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. కన్నీళ్లు తెప్పించే ఈ సంఘటన సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

కొన్ని సంబంధాలు కేవలం రక్త సంబంధాలు కాదు. అవి ప్రేమ, ఆప్యాయతలకు సంబంధించినవ  అని ఈ ఘటన నిరూపించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది.  మరో ఇంటికి కోడలిగా తమ కోడలిని అత్తారింటికి సాగనంపిన క్షణాన, అక్కడున్నవారంతా ఆనంద భాష్పాలు రాల్చారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన దినేష్ బైరాగి కుమారుడు కపిల్‌కు, ప్రియాంకతో 2018లో వివాహం జరిగింది. ప్రియాంక తన ఉన్నత చదువులను పూర్తి చేసి ఆ తరువాత  2023లో అత్తగారింట్లో అడుగుపెట్టింది. వచ్చిన కొద్ది రోజులకే ఆమె తన ప్రేమపూర్వక ప్రవర్తనతో కుటుంబ సభ్యుల మనసు గెలుచుకుంది. అంతా హ్యాపీగాగడిచిపోతుందనుకుంటున్న తరుణంలో దురదృష్టవశాత్తూ, ఆమె వచ్చిన కొన్ని నెలలకే భర్త కపిల్ క్యాన్సర్ బారిన పడ్డాడు. కానీ ప్రియాంక భయపడిపోలేదు.  ఆ కష్టకాలంలో క తన భర్తకు కొండంత అండగా నిలిచింది. కానీ, 2024లో కపిల్ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించాడు. ఆ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

 

కోడలు కాదు.. కూతురు మామగారి గొప్ప నిర్ణయం

చిన్న వయసులోనే భర్తను కోల్పోయి సమాజంలో కష్టాల పాలౌతున్న వారిలా తమ ప్రియాంక జీవితం ముగిసిపోకూడదని ఆమె మామ దినేష్ బైరాగి భావించారు. కొడుకు చనిపోయినంత మాత్రాన కోడలి పట్ల తమ బాధ్యత తీరిపోలేదంటూ భార్యను కూడా ఒప్పించారు. ప్రియాంకకు  మారు మనువు చేసి కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగి వద్ద ప్రస్తావించగా, ఆ కుటుంబం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. సాధారణంగా భర్త చనిపోతే అత్తగారింటితో బంధాలు తెగిపోయే ఈ రోజుల్లో, కోడలి భవిష్యత్తు కోసం అత్తమామలే ఇంతటి నిర్ణయం తీసుకోవడం వారిని ఆశ్చర్యపరిచింది.  ప్రియాంక కోడలు కాదు,  తమ కూతురు అని దినేష్‌ స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి: 256 గంటలు, 131 మంది శ్రమ : ఆమీర్‌-గౌరీ అరుదైన వెడ్డింగ్‌ రింగ్‌

తండ్రిగా కన్యాదానం
దినేష్ బైరాగి విదిషా జిల్లాలోని అరారి ఖేజ్దా గ్రామానికి చెందిన గోవింద్ బైరాగీతో వివాహం నిశ్చయించారు. వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు.  వ్యక్తిని ప్రియాంక కోసం సంబంధం చూశారు. ఈ పెళ్లికి సంబంధించిన ప్రణాళికలు, నిర్వహణ మరియు ఖర్చులన్నీ దినేష్ స్వయంగా భరించారు. పెళ్లి వేడుకలో అత్యంత భావోద్వేగ క్షణం ఏంటంటే, స్వయంగా మామగారే తండ్రి స్థానంలో కూర్చుని ప్రియాంకకు 'కన్యాదానం' చేశారు. పెళ్లికొడుకు చేతిలో ప్రియాంక చేయి పెట్టి, ఆమె కొత్త జీవితం సంతోషంగా సాగాలని ఆశీర్వదించారు.

తండ్రి భావోద్వేగం
ఈ సందర్భంగా ప్రియాంక తండ్రి రాంబాబు బైరాగి కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ బిడ్డ  పునర్వివాహ బాధ్యతను ఆమె అత్తమామలు పూర్తిగా తీసుకుని సమాజానికి ఇంత గొప్ప ఆదర్శాన్ని అందిస్తారని  తాను కలలో కూడా ఊహించలేదంటే కంటతడిపెట్టుకున్నారు.

ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)