Breaking News

స్మృతి-పలాష్‌ పెళ్లిలో మరో ట్విస్ట్‌ : ఇన్‌స్టాలో అప్‌డేట్‌ చూశారా?

Published on Sat, 11/29/2025 - 10:25

భారత మహిళా స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన పెళ్లి వాయిదాకి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వరుడు, స్వరకర్త పలాష్ ముచ్చల్ స్మృతిని మోసం చేసిన కారణంగానే అంగరంగ వైభవంగా జరగాల్సిన అర్థాంతరంగా వాయిదా పడిందన్నపుకార్లు జోరుగా వ్యాపించాయి. ధృవీకరించని చాట్‌లు వైరల్ అయ్యాయి. స్మృతి-పలాష్‌ పెళ్లి వాయిదాకు సంబంధించి స్పష్టమైన అధికారిక ప్రకటన ఏదీ రానప్పటికీ అనేక ఊహాగానాలు రోజుకొకటి వస్తూనే ఉంది. ఇన్ని పరిణామాల మద్య స్మృతి-పలాష్‌  ఇన్‌స్టా మార్పు అభిమానులు  ఆశ్చర్యపరుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పలాష్ ముచ్చల్ - స్మృతి మంధాన ఇద్దరూ దిష్టి  ('blueye') ఎమోజీని చేర్చడం  సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. స్మృతి , హల్ది ,మెహందీ వేడుకల ఫోటోలను  తన సోషల్‌ మీడియా ఖాతాల నుంచి  తొలగించిన కొన్ని రోజులకే వారిద్దరూ ఇన్‌స్టా బయోకు ఒకే ఎమోజీని వాడటం సంచలనంగా మారింది.

స్మృతి-పలాష్  జంట నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ వారు అకస్మాత్తుగా వివాహాన్ని రద్దు చేసుకున్నారు. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే పెళ్లి వాయిదా పడిందని  తొలుత  వార్తలు వచ్చాయి. తరువాత, పెళ్లి ఎందుకు వాయిదా పడిందనే దానిపై సోషల్ మీడియాలో అనేక ఇతర వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, స్మృతి మరియు పలాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో గణనీయమైన మార్పు చేసి అభిమానులను ఆశ్చర్య పరిచారు. మరోవైపు ఇన్ని ఊహాగానాలు, పుకార్ల మధ్య ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని పలాష్ ముచ్చల్ తల్లి అమిత ముచ్చల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇది యాదృచ్చింగా జరిగిందా?  ఇన్‌స్టాలో వీరిద్దరి లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటో అర్థం కాగా ఫ్యాన్స్‌ మాత్రం  ఒక పక్క తెగ సంతోషపడుతూనే, మరో పక్క అయోమయంలో పడిపోయారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)