Breaking News

డీకే విందులో సిద్దరామయ్యకు ఇష్టమైన నాన్‌ వెజ్‌ వంటకాలు

Published on Tue, 12/02/2025 - 08:39

ముఖ్యమంత్రి పదవి మార్పిడి రగడను అల్పాహార విందుల ద్వారా పరిష్కరించుకునేలా కాంగ్రెస్‌ నాయకత్వం.. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను ఆదేశించింది. ఫలితమే వరుసగా జరుగుతున్న బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలు. అందరికీ నోరూరేలా పలు రకాల వంటకాలతో వారి సమావేశాలు జరుగుతూ రచ్చను చల్లార్చే ప్రక్రియలుగా రూపాంతరం చెందాయి.

బెంగుళూరు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మూడురోజుల కిందట అల్పాహార విందును ఆతిథ్యమిచ్చిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. ఇప్పుడు తానే అతిథిగా మారారు. ఈదఫా డీకే విందు ఇవ్వబోతున్నారు. ఇందులో సిద్దుకు ఇష్టమైన నాన్‌ వెజ్‌ ఉండే వీలుంది. మంగళవారం ఉదయం సదాశివనగరలోని డీసీఎం నివాసంలో జరగబోయే ఈ విందు సమావేశం ఉత్కంఠ పుట్టిస్తోంది. సిద్దరామయ్య ఇంట విందులో ఇద్దరూ ఐక్యతను ప్రదర్శించి, కుర్చీ రగడకు విరామం ఇచ్చినట్లు చాటుకున్నారు. ఇది ఫలించినట్లుగా ఉందనుకున్న హైకమాండ్‌ తిరుగు విందు ఇవ్వాలని డీకేశిని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి బెళగావిలోని సువర్ణసౌధ భవనంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. ప్రతిపక్షాలకు కుర్చీ మారి్పడి గందరగోళం ఆయుధం కాకూడదని సీఎం, డీసీఎం తీర్మానించారు.  

హైకమాండ్‌ ఆవరణలో బంతి.. 
గత 15 రోజుల నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌లో సీఎం సీటు తగాదా తారాస్థాయికి చేరింది.  హైకమాండ్‌ మనసులో ఏముందో బయట పెట్టకుండా సామరస్య పరిష్కారానికి సూచనలు చేస్తోంది. మీరిద్దరే కూర్చొని చర్చించుకొని ఓ తీర్మానానికి వచ్చి ఆ తరువాత ఢిల్లీకి రండని సూచించినట్లు తెలుస్తోంది.  బెంగళూరులో సీఎం, డిప్యూటీ సీఎం విందు భేటీల ద్వారా తమ టాసు్కలను పూర్తి చేస్తుండగా, ఢిల్లీలో హైకమాండ్‌ తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. సోనియాగాం«దీ, రాహుల్‌గాందీకి పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఇక్కడి పరిణామాలను వివరించి, త్వరగా పరిష్కారం కనుగొనాలని కోరారు. సోనియా, రాహుల్‌ త్వరలోనే ఇద్దరినీ  పిలిపించుకొని కార్యాచరణను తెలియజేస్తారని కాంగ్రెస్‌ ఉన్నత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వారంలో మొదలవుతాయి, ఆ తరువాత హైకమాండ్‌ నిర్ణయం వెలువరిస్తుందని సమాచారం.

 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)